AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దొంగ బుద్ధి చాటుకుంటున్న డ్రాగన్ కంట్రీ

సరిహద్దులో బలగాల ఉపసంహరణకు సరేనంటూనే మరోపక్క కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది డ్రాగన్ కంట్రీ. టిబెట్ పరిసర ప్రాంతాలతో పాటు అక్సాయ్ చిన్ ప్రాంతాల్లో చైనా సైనిక నిర్మాణాన్ని కొనసాగిస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా బహిర్గతమవుతోంది.

దొంగ బుద్ధి చాటుకుంటున్న డ్రాగన్ కంట్రీ
Balaraju Goud
|

Updated on: Jul 27, 2020 | 3:29 PM

Share

సరిహద్దులో బలగాల ఉపసంహరణకు సరేనంటూనే మరోపక్క కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది డ్రాగన్ కంట్రీ. టిబెట్ పరిసర ప్రాంతాలతో పాటు అక్సాయ్ చిన్ ప్రాంతాల్లో చైనా సైనిక నిర్మాణాన్ని కొనసాగిస్తున్నట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా బహిర్గతమవుతోంది.

లద్దాఖ్‌ వద్ద చొరబాట్లకు సంబంధించిన చర్చలు అసంపూర్ణంగా ఉన్న దశలోనే ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం. చైనా సైన్యం కదలికలతో భారత్‌ కూడా దీటైన రీతిలో మరిన్ని బలగాలను, యుద్ధ సామాగ్రిని సరిహద్దు ప్రాంతాలకు తరలిస్తోంది. దీని కోసం ఇతర ప్రాంతాల నుంచి, ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల్లోని శాంతియుత ప్రాంతాల నుంచి రిజర్వ్‌ బలగాలను సమీకరిస్తోంది.

పశ్చిమ సెక్టార్‌లోని అక్సాయ్ చిన్ పై కన్నుబడ్డ చైనా అక్రమణకు పాల్పడి మరింత ముందుకొచ్చేందుకు ప్రయత్నిస్తూనే ఉంది. ప్రస్తుతం ఈ ప్రాంతం చైనా నియంత్రణలో ఉంది. భారత్‌తో 1962లో జరిగిన యుద్ధం సమయంలో ఈ ప్రాంతాన్ని చైనా ఆక్రమించింది. మరోవైపు తూర్పు సెక్టార్‌లోని అరుణాచల్ ప్రదేశ్ తమ భూభాగమని, ఇది దక్షిణ టిబెట్‌లో భాగమని చైనా వాదిస్తోంది. టిబెట్, అరుణాచల్ ప్రదేశ్ మధ్యలో ఉన్న మెక్‌మోహన్ రేఖను చైనా అంగీకరించడం లేదు. అక్సాయ్ చిన్ తమదని భారత్ చేస్తున్న వాదనను కూడా ఆ దేశం ఖండిస్తోంది. గాల్వాన్ ఘటన తర్వాత ఎలాగైన భారత్ ను దెబ్బ తీసేందుకు చైనా కుయుక్తులు పన్నుతోంది. ఇందులో భాగంగానే మరోసారి మెల్లమెల్లగా బలగాలను సరిహద్దు ప్రాంతాలకు తరలిస్తోంది. ఇదే విషయం శాటిలైట్ చిత్రాల ద్వారా వెల్లడైంది.

సరిహద్దులో ఉద్రిక్తతలు చల్లార్చడానికి కట్టుబడి ఉన్నట్లు చైనా వివిధ దశల్లోని చర్చల్లో ప్రకటించినా ఇప్పటికీ లద్దాఖ్‌ నుంచి తన బలగాలను ఉపసంహరించడం లేదు. పైపెచ్చు మరింత మంది సైనికుల్ని అక్కడ మోహరిస్తోంది. బలగాలనే కాకుండా గగనతల రక్షణ వ్యవస్థలు, దీర్ఘశ్రేణి పోరాట సామాగ్రిని అక్కడకు తరలిస్తూనే ఉంది. ఫింగర్‌-5 ప్రాంతం నుంచి వెనక్కి మళ్లేందుకు చైనా సైనికులు ససేమిరా అంటున్నారు. పైగా ఘర్షణలకు నెలవైన హాట్స్ప్రింగ్స్‌, గోగ్రాపోస్ట్‌ ప్రాంతాల్లో భారీగా నిర్మాణాలు చేపట్టారు. నార్త్ ఈస్ట్‌ ప్రాంతంలో హెలిప్యాడ్‌ల కోసం తాజా నిర్మాణం జరుగుతోంది. రాబోయే శీతాకాలం వరకు వేచిచూసి పక్కాగా దాడి చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. జూలై 21 న టిబెట్‌లోని షిక్వాన్హే నుండి చైనా బలగాలు బిల్డ్-అప్‌ను చూపించే ఉపగ్రహ చిత్రాలను ట్వీట్టర్ వేదికగా పోస్ట్ చేసింది. లడఖ్‌లోని ఎల్ఏసీ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యల్లో భాగమని అనుమానిస్తున్నారు. దాదాపు 5,000 మంది సాయుధ బలగాలు యుద్ధ సామాగ్రితో సహా సిద్ధమవుతున్నట్లు చిత్రాల్లో స్పష్టమవుతోంది. పిఎల్‌ఎలో శీతాకాలపు బస కోసం మాత్రమే చైనా వెనక్కి తగ్గిట్లు నటిస్తోందని, తిరిగి వెనక్కి వెళ్లిన ప్రాంతాలకు తిరిగి రాగలదని రక్షణ నిపుణలు సూచిస్తున్నారు.

మరోవైపు, భారత సైన్యం కూడా శీతాకాలానికి పూర్తిస్థాయిలో సిద్ధమవుతోంది. ఎల్‌ఐసి వెంట పలు చోట్ల 30,000 మందికి పైగా అదనపు దళాలు మోహరించాయి. బలగాలకు కావల్సి యుద్ధ సామాగ్రితో పాటు మిలటరీకి కావల్సిన సదుపాయాలపై భారత రక్షణ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.