Russia-Ukraine War: హృదయాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఒకే ఒక్క ఫోటో.. ప్రపంచమంతా ట్రెండింగ్

ఉక్రెయిన్‌ కన్నీరు పెడుతోంది. అక్కడి పరిస్థితులు గంటగంటకు అధ్వాన్నంగా మారుతున్నాయి. పదుల సంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోతున్నారు. అక్కడి పరిస్థితులు హృదయవిదారకంగా మారుతున్నాయి.

Russia-Ukraine War: హృదయాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఒకే ఒక్క ఫోటో.. ప్రపంచమంతా ట్రెండింగ్
Russian Emotional Photo

Updated on: Feb 25, 2022 | 1:56 PM

Russia-Ukraine Crisis: ఒక్క ఫొటో. ఒకే ఒక్క ఫొటో ఇప్పుడు ప్రపంచ జనాల మదిని కలిచివేస్తోంది. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కల్గిస్తున్నాయి. ఓ రష్యన్ హగ్ ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను కన్నరు పెట్టిస్తుంది. ఎదుటి వ్యక్తికి హగ్ ఇచ్చిన రష్యన్‌.. ‘I am Russian.. sorry for that’ అంటూ ప్లకార్డు ప్రదర్శించిన తీరు చర్చనీయాంశంగా మారింది.  ఉక్రెయిన్‌ వాసులను రష్యన్ క్షమాపణ కోరుతున్న తీరు.. ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతుంది. ఉక్రెయిన్‌పై దాడి కొందరు రష్యన్‌లకు నచ్చడం లేదా? అందరి అంగీకారం లేకుండానే పుతిన్ యుద్ధం ప్రకటించాడా? ఉక్రెయిన్‌లో మారణహోమం రష్యన్‌లో మనస్సు కలిచివేస్తుందా? అంటే అవునని స్పష్టం చేస్తున్నాయి ఇలాంటి దృశ్యాలు. ఉక్రెయిన్‌లో మారణహోమం కొనసాగుతోంది. ఎటు చూసినా హృదయ విదారక దృశ్యాలు. చిన్నా, పెద్దా అన్న తేడా లేకుండా రష్యా దాడితో విలవిలలాడిపోతున్నారు. ఐతే రష్యాను తీరును తీవ్రంగా ఖండిస్తున్నాయి ప్రపంచ దేశాలు. రష్యా తీరుపై స్వదేశంలోనే పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అధ్యక్షుడు పుతిన్(Vladimir Putin) తీరుకు నిరసనగా వేలాది మంది రోడ్డెక్కారు. సెయింట్‌ పీటర్స్‌ బర్గ్‌లో ఉక్రెయిన్‌పై యుద్ధం ఆపాలంటూ ఆందోళనలకు దిగారు. వెయ్యిమందికి పైగా రష్యన్లను అదుపులోకి తీసుకున్నాయి రష్యన్‌ బలగాలు.

ఉక్రెయిన్‌ రాజధాని కీవ్ రష్యా చేతుల్లోకి వెళ్లిందని స్వయంగా అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించాడు. అంతేకాదు రష్యా టార్గెట్‌ ఏంటో కూడా వివరించాడు. తనను తన కుటుంబాన్ని నాశనం చేయడమే వాళ్ల లక్ష్యమన్నాడు. నిజంగానే.. జెలెన్‌స్కీ ఊహించినట్టే జరగబోతుందా? పుతిన్‌ అదే కోరుకుంటున్నాడా..? రష్యా బలగాలు కూడా ఆ దిశగా కదులుతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్నేక్ ద్వీపాన్ని రష్యా బలగాలు ఇప్పటికే సొంతం చేసుకున్నాయి. చెర్నోబిల్ ప్రాంతం కూడా రష్యా సేనల వశమైంది. ఈ క్రమంలోనే జెలెన్ స్కీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రస్తుతం అధ్యక్షుడు ఎక్కడ ఉన్నాడన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. రష్యా బలగాలు మాత్రం పశ్చిమ ఉక్రెయిన్‌ దిశగా కదులుతున్నాయి.

ఇక తన కుటుంబాన్ని, కుమార్తెను సురక్షిత ప్రాంతానికి పంపిస్తూ.. యుద్ధానికి వెళ్లబోతున్న ఓ ఉక్రెయిన్ పౌరుడి వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. ఈ దృశ్యం చాలామందిని కలచివేస్తుంది.

Also Read:  ఒక్కరు కూడా తోడు లేరు.. ఒంటరి అయ్యాం: ఉక్రెయిన్‌ ప్రెసిడెంట్

ఇతడి డైలాగ్ గర్జనలా ఉంటుంది.. ఫైట్ యుద్ధంలా ఉంటుంది.. ఎవరో గుర్తించారా