రష్యా, ఉక్రెయిన్ ల మధ్య వార్ కొనసాగుతూనే ఉంది. ఉక్రెయిన్ మళ్లీ దాడులతో దద్దరిల్లుతోంది. భారీ క్షిపణులతో రష్యా దాడులకు దిగుతోంది. 9 మంది చనిపోగా.. సుమారు 30కి మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడిని ఉక్రెయిన్ మంత్రిత్వ శాఖ జెనీవా ఒప్పందాల ప్రకారం.. తీవ్రమైన యుద్ధ నేరంగా పేర్కొంది. యుద్ధంలో సైనికులు, పౌరుల పట్ల ఎలా వ్యవహరిస్తోంది రష్యా అనేదానికి ఇది ఉదాహరణ. అందుకు సంబంధించి వీడియో ఫుటేజ్‌లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ వీడియోలో ధ్వంసమైన భవనం నుంచి పొగలు వస్తున్నట్లు కనిపించాయి. మూడంతస్థుల సదరు భవనం పైఅంతస్థుల పూర్తిగా దెబ్బతింది.
దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ట్విట్టర్ పోస్టు చేశారు. దుష్ట దేశం మాత్రమే ఇలా క్లినిక్‌లపై దాడి చేస్తుందని ఆరోపించారు. ఇందులో సైనిక ప్రయోజనం ఉండదని. ఇది నిజంగా రష్యన్ టెర్రర్ పనేనని మండిపడ్డారు. మానవత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న యుద్ధ నేరం అని జెలెన్స్కీ మండిపడ్డారు. ఇదిలా ఉండగా క్షిపణి దాడికి ముందు ఈ క్లినిక్‌లో ఇద్దరు పిల్లల తోసహా 30 మంది ఈ భవనంలో ఉన్నట్లు భావిస్తున్నారు. అలాగే సరిగ్గా అదే సమయంలో 69 ఏళ్ల వ్యక్తి ఈ క్లినిక్‌ని దాటుతుండగా హత్యకు గురయ్యాడని, శిథిలాల నుంచి మరో వ్యక్తి మృతదేహాన్ని బయటకు తీసినట్లు ప్రాంతీయ గవర్నర్ సెర్హి లైసాక్ పేర్కొన్నారు. అటు.. ఉక్రెయిన్ మందుగుండు సామాగ్రి డిపోలపై రాత్రిపూట దాడి చేసినట్లు రష్యా మంత్రిత్వ శాఖ ఆరోపిస్తోంది. అంతేగాదు దక్షిణ రష్యాలో ఉక్రెయిన్ రాకెట్, డ్రోన్లతో దాడి చేసిందని పేర్కొంది. అందువల్లే తాము క్షిపణి దాడి చేసినట్లు రష్యా పేర్కొంది. పైగా యుద్ధ నేరాలకు పాల్పడినట్లు చేస్తున్న ఆరోపణలను కూడా తోసిపుచ్చుతోంది రష్య. కానీ ఉక్రెయిన్ మాత్రం ఉక్రెయిన్ రాజధాని కీవ్ తూర్పు ప్రాంతంలో రష్యా సుమారు 10 క్షిపణులు, 20కి పైగా డ్రోన్‌లు కూల్చివేసినట్లు పేర్కొనడం గమనార్హం.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..