Vladimir Putin: 2036 వరకు రష్యా అధ్యక్షుడిగా కొనసాగనున్న వ్లాదిమిర్‌ పుతిన్‌.. కొత్త చట్టంతో పదవి కాలం పెంపు

|

Apr 06, 2021 | 10:09 AM

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ 2036 వరకు కొనసాగనున్నారు. కాగా, ప్రస్తుతం ఆయన పదవీ కాలం 2024తో ముగియనుండా, 2036 వరకు...

Vladimir Putin: 2036 వరకు రష్యా అధ్యక్షుడిగా కొనసాగనున్న వ్లాదిమిర్‌ పుతిన్‌.. కొత్త చట్టంతో పదవి కాలం పెంపు
Vladimir Putin
Follow us on

Vladimir Putin: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ 2036 వరకు కొనసాగనున్నారు. కాగా, ప్రస్తుతం ఆయన పదవీ కాలం 2024తో ముగియనుండా, 2036 వరకు పదవిలో కొనసాగే చట్టంపై ఆయన సోమవారం సంతకం చేశారు. తాజాగా తీసుకువచ్చిన కొత్త చట్టంతో ఈ టర్మ్‌ ముగిసిన తర్వాత కూడా మరో రెండు దఫాలుగా పదవిలో కొనసాగనున్నారు.

అయితే ప్రస్తుతం పుతిన్‌ రెండోసారి అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. చట్టంలోని మార్పుల కోసం గత ఏడాది వేసవిలో ఎన్నికలు నిర్వహించారు. 68 శాతం మంది ఈ చట్టాన్ని సమర్థిస్తూ ఓట్లు వేశారు. ప్రస్తుతం 68 ఏళ్లు ఉన్న పుతిన్‌ 83 ఏళ్లు వచ్చే వరకు ఈ పదవిలో కొనసాగుతారు.

నాలుగేళ్లలో తన పదవీ కాలం ముగియనుండగా, అపై మరో 12 ఏళ్ల వరకు తనకు ఎటువంటి అవాంతరాలు లేకుండా పుతిన్ మార్గాన్ని సుగమం చేసుకున్నారు. 2024 తరువాత మరో 12ఏళ్లు తనే అధ్యక్షుడిగా కొనసాగించేందుకు వీలుగా చేసిన రాజ్యాంగ సవరణలకు రష్యా పార్లమెంట్‌ తో ఆమోద ముద్ర వేయించుకున్నారు.

కాగా, ఈ మేరకు ‘ద స్టేట్‌ డ్యూమా’ దేశ రాజ్యాంగ సవరణలకు ఏకగ్రీవ ఆమోదం పలికింది. ఈ సవరణలకు 383 అనుకూల ఓట్లు రాగా, వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడకపోవడం గమనార్హం. 43 మంది పార్లమెంట్ సభ్యులు హాజరు కాలేదు. ‘ద స్టేట్‌ డ్యూమా’ ఈ సవరణలకు ఆమోదం పలికిన గంటల వ్యవధిలోనే ఎగువ సభ ‘ఫెడరేషన్‌ కౌన్సిల్‌’ ఆమోదం కూడా లభించింది.

ఇవీ చదవండి: Bernard Taupie: అర్థరాత్రి బీభత్సం… మాజీ మంత్రిని తాళ్లతో కట్టేసి దుండుగల దాడి.. భారీగా చోరీ

జోర్డాన్‌ రాజ కుటుంబంలో ముసలం.. దేశద్రోహం కేసులో గృహ నిర్బంధంలో మాజీ యువరాజు..!

Robot artist: ఏం క్రియేటివిటి గురూ.. ఈ రోబో వేసిన పెయింటింగ్‌ ఎంత ధర పలికిందో తెలిస్తే షాకవుతారు..!