Viral Photo: ఏనుగుపై నగ్నంగా పోజులు.. జనాలు తిట్ల దండకం.. క్షణాల్లో వీడియో డిలీట్.!
రష్యాకు చెందిన అలెస్య కఫెల్కికోవా అనే మోడల్.. అదే ఏనుగు కుంభస్థలం ఎక్కి విత్‌ఔట్ లాటరీ లెక్కలేనన్ని డబ్బులు కొట్టేసింది.,,,
Russian Model Photo: ఎవడికైనా లాటరీలో.. లెక్కలేనన్ని డబ్బులు వచ్చాయనుకో.. వాడు ఏనుగు కుంభస్థలం కొట్టాడురా అంటారు అందరూ. కానీ.. రష్యాకు చెందిన అలెస్య కఫెల్కికోవా అనే మోడల్.. అదే ఏనుగు కుంభస్థలం ఎక్కి విత్‌ఔట్ లాటరీ లెక్కలేనన్ని డబ్బులు కొట్టేసింది. అదేంటి.. కుంభస్థలం ఎక్కడం, డబ్బులు కొట్టడం అని అనుకుంటున్నారా.! అసలు విషయం మీరే చూడండి.
అలెస్య కఫెల్కికోవాకు సుమత్రా అనే ఏనుగు మీద ఎక్కాలని కోరిక పుట్టింది. అనుకున్నదే తడువుగా ఏనుగు ఎక్కేసింది. అయితే, ఇందులో ఆశ్చర్యం ఏమి ఉంది.?! ఏనుగు ఎక్కితే ఇదేమన్నా పెద్ద గొప్ప విషయమా అని అనుకుంటున్నారా.? అయితే ఆ ఏనుగు మీద ఎక్కిన అలెస్య కఫెల్కికోవా కనీసం ఒంటి మీద నూలుపోగు కూడా ఉంచుకోకుండా నగ్నంగా ఏనుగు ఎక్కి దానిమీద పోజులు ఇచ్చింది.
ఓ ఫోట్ షూట్‌లో భాగంగా.. అలెస్య కఫెల్కికోవా ఈ ఘనకార్యం చేసింది. ఇక ఆమేదో.. గొప్ప పని చేసినట్లుగా… ఈ ఘనకార్యాన్ని అంతా వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియో చూసి జంతు ప్రేమికులు తిట్ల దండకం మొదలుపెట్టారు. ఆ కామెంట్స్ చూసిన ఆమె వెంటనే ఆ వీడియోను తీసేసింది. అంతేకాదు ఏనుగులంటే తనకెంతో ఇష్టమని, అందుకే ఇలాంటి ఫొటోషూట్ చేసినట్లు చెప్పుకొచ్చింది. తన ఫోటో అభ్యంతరంగా అనిపించినందుకు సోషల్ మీడియా వేదికగా మోడల్ క్షమాపణలు చెప్పింది.
”నేను చాలా సంవత్సరాలుగా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. అంతేకాకుండా కొద్దిరోజులు క్రితం స్థానికంగా ఉండే ప్రజలు, జంతువుల కోసం ఆర్ధిక సహాయం చేశాను.అందుకోసమే ఈ ఫోటోషూట్ జరిగింది. జనాలు ఏమో దీనిని అసభ్యకరంగా చూస్తున్నారు. నేను జంతువులను ప్రేమిస్తున్నాను, ముఖ్యంగా ఏనుగులను ప్రేమిస్తున్నాను! అంతేకాకుండా బాలిని చాలా ప్రేమిస్తున్నాను!
ఇది ఒక ప్రైవేట్ ఫోటోషూట్, స్థానిక ప్రజల మనోభావాలను బాధపెట్టే ఉద్దేశ్యం నాకు లేదు. మేము బాలినీస్ సంస్కృతిని ప్రేమిస్తున్నాము, ఇండోనేషియా నియమాలను గౌరవిస్తాము. ఒకవేళ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి. ఈ చిత్రాలతో నా ఉద్దేశ్యం ఏమిటంటే.. నేను జంతువులను.. ముఖ్యంగా ఏనుగులను అన్నింటికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను, గౌరవిస్తాను” అని పేర్కొంది.
Also Read: భార్య చిలిపి ముద్దు.. ఆగ్రహించిన భర్త.! జూమ్ మీట్‌లో ఫన్నీ రొమాన్స్.. నెటిజన్లు ఫిదా..
AlesyaKafelnikova sekarang udah banyak Orang asing PANSOS di INDONESIA. apa ini kerja Intel mereka dr dulu???? ingin ku berkata GOBLOGGGG#LihatDenganJernih pic.twitter.com/U8VA9xifFC
— ANTON RASI (@ANTONRASI2) February 18, 2021