Russias Military: రష్యా సైనికుల వాహనాలపై జెడ్‌ (Z) అనే అక్షరం ఎందుకు ఉంటుందో తెలుసా..?

|

Feb 27, 2022 | 3:39 PM

Russias Military: ఉక్రెయిన్‌-రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్‌ (Ukraine)పై రష్యా దాడులకు తెగబడుతోంది. ఉక్రెయిన్‌ కూడా రష్యా బలగాలను అడ్డుకునేందుకు..

Russias Military: రష్యా సైనికుల వాహనాలపై జెడ్‌ (Z) అనే అక్షరం ఎందుకు ఉంటుందో తెలుసా..?
Follow us on

Russias Military: ఉక్రెయిన్‌-రష్యా మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఉక్రెయిన్‌ (Ukraine)పై రష్యా దాడులకు తెగబడుతోంది. ఉక్రెయిన్‌ కూడా రష్యా బలగాలను అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గత నాలుగు రోజులుగా ఈ యుద్ధం కొనసాగుతోంది. ప‌లు న‌గ‌రాలు, మిల‌ట‌రీ బేస్‌ల‌పై ర‌ష్యా వైమానిక దాడులు కొన‌సాగుతున్నాయి. దీంతో వేలాది మంది పౌరులు అండ‌ర్ గ్రౌండ్‌లో దాక్కుండిపోయారు. అయితే.. ర‌ష్యాకు (Russia)చెందిన ప‌లు సైనిక వాహ‌నాల‌పై z గుర్తు ఉంటుంది. ఈ గుర్తు ఎందుకు ఉంటుందనేది చాలా మందిలో తలెత్తుతున్న ప్రశ్న. టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. ఈ Z గుర్తు రష్యాకు చెందిన అన్ని సైనిక వాహనాలపై కనిపిస్తోంది. ఇదో రకమైన ఎర్రజెండా లాంటిదట. వీటిని రోజ్గావార్డియా ట్రూప్స్ అని పిలుస్తుంటారు. రష్యా జాతీయ భ‌ద్రతా ద‌ళం అని కూడా అంటారట.. ఖైదీల‌ను తీసుకెళ్లే ఎవ్‌టోజాక్స్ వాహ‌నాల్లో వీరంద‌రూ వెళ్తున్నారు. బెల్గోరోడ్ ప్రాంతంలోని ఈ వాహ‌నాల‌ను ఎప్పుడూ ఈ జెడ్ గుర్తును ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

అయితే రష్యా జాతీయ భద్రతా దళాలు వాడే వాహనాలపైనే ఈ జెడ్‌ (Z) గుర్తు ఉంటుందని, దీని బట్టి రష్యా వీరిని కూడా రంగంలోకి దింపిందని అర్థం చేసుకోవచ్చని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ రోజ్గా వార్డియా ట్రూప్స్ (ర‌ష్యా జాతీయ భ‌ద్రతా ద‌ళం) ర‌ష్యా అధ్యక్షుడు పుతిన్ భద్రతా వ్యవహారాలను మాత్రమే చూస్తుంది. వీరందరూ మెరికల్లాంటి జ‌వాన్లని, ఆర్మ్‌డ్ ఫోర్స్ కంటే మెరిక‌ల్లా విధులు నిర్వర్తిస్తార‌ని తెలుస్తోంది. ఏ ప్రదేశంలోనైనా చొర‌బ‌డి, ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకునే శ‌క్తి ఈ బ‌ల‌గాల‌కు ఉంటుంద‌ని తెలుస్తుంది. వీరికి ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తారని చెబుతున్నారు.

దీనిపై ఇంకో వాదన కూడా వినిపిస్తోంది. రష్యా సైనికులే రష్యా సైనికుల వాహనాలపై కాల్పులు జరపకుండా ఈ జెడ్‌ (Z) గుర్తు వాడుతారని కూడా తెలుస్తోంది. ఇదో రకమైన కమ్యూనికేషన్‌ సిగ్నల్స్‌ అని పేర్కొంటున్నారు. కేవ‌లం యుద్ధాల్లోనే వీటిని ఉప‌యోగిస్తారు అన్న మెసేజ్ కూడా ఇందులో ఉంటుంద‌ట‌. అధికారుల‌కు కూడా సుల‌భంగానే యుద్ధానికి ఉప‌యోగించే వాహ‌న‌మేదో తెలిసిపోడానికి జెడ్ (z) అక్షరం రాస్తారట.

ఇవి కూడా చదవండి:

Mars: అంగారకుడిపై పువ్వులా కనిపించే రాయిని కనుగొన్న క్యురియాసిటీ రోవర్‌.. ఆశ్చర్యపోయిన శాస్త్రవేత్తలు

Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌కు జపనీస్ బిలియనీర్ హిరోషి మికిటాని ఆర్థిక సాయం.. ఎంత ప్రకటించారో తెలుసా?