AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు భారీ ఎదురుదెబ్బ.. నల్ల సముద్రంలో పేలడు.. యుద్ధనౌక ధ్వంసం

ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నల్ల సముద్రంలో జరిగిన పేలుడులో రష్యా క్షిపణి క్రూయిజర్ ధ్వంసమైంది . దీని తరువాత, క్షిపణి క్రూయిజర్ 'మోస్క్వా' సిబ్బందిని సురక్షితంగా తరలించారు.

Russia Ukraine War: ఉక్రెయిన్‌తో యుద్ధంలో రష్యాకు భారీ ఎదురుదెబ్బ.. నల్ల సముద్రంలో పేలడు.. యుద్ధనౌక ధ్వంసం
Russian Flagship 'moskva'
Balaraju Goud
|

Updated on: Apr 14, 2022 | 4:12 PM

Share

Russia Ukraine War: ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. నల్ల సముద్రం(Black Sea)లో జరిగిన పేలుడులో రష్యా క్షిపణి క్రూయిజర్(Missile Cruiser) ధ్వంసమైంది . దీని తరువాత, క్షిపణి క్రూయిజర్ ‘మోస్క్వా’ సిబ్బందిని సురక్షితంగా తరలించారు. ఈ సమాచారాన్ని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ పేలుడులో క్షిపణి క్రూయిజర్ కూడా చాలా నష్టపోయిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. యుద్ధ నౌకలో మంటలు చెలరేగడంతో పేలుడు సంభవించిందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. స్లావా క్లాస్ మిస్సైల్ క్రూయిజర్ 1979లో ప్రారంభించడం జరిగింది. ఇందులో 16 యాంటీ షిప్ క్షిపణులు, అనేక వాయు రక్షణ క్షిపణులు, టార్పెడోలు, తుపాకులు మోహరించడానికి ఉపయోగిస్తుంటారు. ఈ రష్యన్ యుద్ధనౌక బ్లాక్ సీ ఫ్లీట్‌లో చేర్చడం జరిగింది. ఫిబ్రవరి నుండి ఉక్రెయిన్‌పై యుద్ధంలో పాల్గొంటోంది.

ఆరు వారాలుగా ఉక్రెయిన్‌పై భీకర దాడులు కొనసాగిస్తోన్న రష్యా.. పలు నగరాలను పూర్తిగా ధ్వంసం చేసే లక్ష్యంతో ముందుకెళ్తోంది. ముఖ్యంగా తీరప్రాంత నగరాలపై దాడులు చేసేందుకు భారీ ఆయుధ సామగ్రిని తరలిస్తోంది. ఈ క్రమంలో రష్యా యుద్ధ నౌక తీవ్రంగా దెబ్బతింది. నౌకలో పేలుడు కారణంగా తీవ్రంగా దెబ్బతిన్నట్లు రష్యా అధికారులు ధ్రువీకరించారు. యుద్ధ నౌకలో మందుగుండు పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని రష్యా రక్షణశాఖ ప్రకటించింది. మరోవైపు రష్యా యుద్ధనౌకపై తామే క్షిపణితో దాడి చేశామని ఉక్రెయిన్‌ ప్రకటించగా.. రష్యా మాత్రం దాన్ని తోసిపుచ్చింది. ఒడెస్సాలో దాచిన నెప్ట్యూన్ యాంటీ షిప్ క్షిపణుల బ్యాటరీ మోస్క్వాను రెండుసార్లు తాకినట్లు ఉక్రేనియన్ అధికారులు బుధవారం సాయంత్రం పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఒడెస్సాలోని మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ హెడ్ మాక్సిమ్ మార్చెంకో, కైవ్‌లోని అంతర్గత మంత్రిత్వ శాఖ సలహాదారు అంటోన్ గెరాస్చెంకో వెల్లడించారు. గతంలో ఉక్రెయిన్ స్నేక్ ఐస్‌ల్యాండ్‌లో వాసిలీ బైకోవ్ షిప్‌ను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. మార్చి 7న ఓడను ఫిరంగి రాకెట్ ఢీకొట్టిందని ఉక్రేనియన్ మీడియా పేర్కొంది.

ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసింది. రష్యా దాడుల్లో కైవ్, మారియుపోల్, ఖార్కివ్ వంటి నగరాలన్నీ పూర్తిగా ధ్వంసమయ్యాయి. అయితే రష్యా దాడులకు తమ సైనికులు నిరంతరం ప్రతిస్పందిస్తున్నారని ఉక్రెయిన్ పేర్కొంది. ఉక్రెయిన్‌పై భీకర దాడులు చేస్తున్నప్పటికీ రష్యా భారీ స్థాయిలో నష్టాలను చవిచూస్తోందని అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే 20వేల మంది సైనికులతో పాటు భారీ స్థాయిలో వైమానిక, యుద్ధ సామగ్రి, ఆయుధాలను రష్యా కోల్పోయినట్లు ఉక్రెయిన్‌ రక్షణశాఖ వెల్లడిస్తోంది. రష్యాపై యుద్ధం కొనసాగించడానికి తమకు ఆయుధాలు సమకూర్చాలని ప్రపంచ దేశాలకు విజ్ఞప్తి చేస్తోంది. UN ప్రకారం, ఇప్పటివరకు 1800 కంటే ఎక్కువ ఉక్రేనియన్ పౌరులు యుద్ధంలో మరణించారు. అయితే, తమవైపు కేవలం 1350 మంది మాత్రమే చనిపోయారని పేర్కొంటోన్న రష్యా.. తమ ప్రణాళిక ప్రకారం లక్ష్యాలు చేరే వరకు యుద్ధం కొనసాగుతుందని స్పష్టం చేస్తోంది.

Read Also…. India-Pak: పాక్ నూతన ప్రధాని స్నేహ హస్తాంలో విషపు కత్తులు.. భారత్‌కు తీయటి మాటల స్వాగతం..!