Russia-Ukraine War: ఉక్రెయిన్-రష్యా సంక్షోభం కొనసాగుతోంది. రష్యా దళాలు మూడు రోజులుగా ఉక్రెయిన్‌పై దాడులు కొనసాగిస్తోంది. ఉక్రెయిన్-రష్యా యుద్ధం సుదీర్ఘంగా కొనసాగే అవకాశం, సంక్షోభ పర్యవసనాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్యూనుయేల్ మాక్రాన్ ( Emmanuel Macron) అన్నారు. ఉక్రెయిన్-రష్యా సంక్షోభం (Russia-Ukraine Crisis)పై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌లో సుదీర్ఘ యుద్ధానికి ప్రపంచం సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఫ్రాన్స్ వ్యవసాయ ఉత్పత్తుల వార్షికోత్సవంలో శనివారం ఆయన పాల్గొని మాట్లాడారు. సాధారణంగా ఫ్రెంచ్ రాజకీయ క్యాలెండర్‌లో ముఖ్యమైన వాటిలో వ్యవసాయ ఉత్సవం ఒకటి. ఇక ఉక్రెయిన్-రష్యా సంక్షోభం కారణంగా ఉత్సవంలో గడిపే సమయాన్ని మైక్రాన్ కుదించారు. అయితే యుద్ధాన్ని రష్యా అధ్యక్షుడు పుతిన్ (Putin) ఏకపక్షంగా నిర్ణయించుకోవడం విషాదకరమైన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి వ్యతిరేకంగా ఆంక్షలు విధించడంతో ఫ్రాన్స్‌లోని నిర్ధిష్ట రంగాలకు ముఖ్యంగా వైన్ కంపెనీలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. ఈ ముప్పును ఎదుర్కొవడానికి సహకరించే స్థిరత ప్రణాళికను తీసుకురానున్నట్లు మైక్రాన్ అన్నారు. ఉక్రెయిన్‌లోని పరిస్థితిపై ఫ్రాన్స్ అధ్యక్షుడు మంత్రులతో, సైనిక భద్రతా అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పలు మార్లు మాట్లడటం, అమెరికా అధ్యక్షుడు బైడెన్ మధ్య శిఖరాగ్ర సమావేశం ఏర్పాటుకు ప్రయత్నించినా ఫలించలేదు. యుద్ధాన్ని నిలిపేందుకు దౌత్యపరమైన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
ఏప్రిల్‌లో ఫ్రాన్స్‌లో అధ్యక్ష ఎన్నికలు:
మరోవైపు ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఫ్రాన్స్‌లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ప్రస్తుతం అధ్యక్షుడు మైక్రాన్ రెండో సారి పోటీలోకి దిగనున్నారు. ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఏ మేరకు ప్రభావం ఉంటుందోనని ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఇవి కూడా చదవండి: