Russia Ukraine War: ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న రష్యా దాడులు.. షాకింగ్ ఆరోపణలు చేసిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌..

|

Jun 14, 2022 | 5:57 AM

Russia Ukraine War: ఉక్రెయిన్‌లో రష్యా సైన్యం ఆగడాలు ఇంకా కొనసాగుతున్నాయి. కీలకమైన డాన్‌బాస్క్‌ను పూర్తిగా తన స్వాధీనం చేసుకునే దిశగా

Russia Ukraine War: ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న రష్యా దాడులు.. షాకింగ్ ఆరోపణలు చేసిన ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌..
Russia Vs Ukraine
Follow us on

Russia Ukraine War: ఉక్రెయిన్‌లో రష్యా సైన్యం ఆగడాలు ఇంకా కొనసాగుతున్నాయి. కీలకమైన డాన్‌బాస్క్‌ను పూర్తిగా తన స్వాధీనం చేసుకునే దిశగా అక్కడి కీలక నగరాల మీద దాడులను కొనసాగిస్తోంది. తాజాగా సీవీరోదొనెట్స్క్‌లోని అజోట్‌ కెమికల్‌ ఫ్యాక్టరీ మీద భారీగా బాంబింగ్‌ చేయడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ఫ్యాక్టరీ ఆవరణలోని బంకర్లలో 800 మంది వరకూ తలదాచుకున్నారని తెలుస్తోంది. వీరిలో 400 మంది వరకు ఉక్రెయిన్‌ సైనికులేనని ఉన్నారని రష్యన్‌ వర్గాలు తెలిపాయి.

మరోవైపు ఖార్కివ్‌ను హస్తగతం చేసుకోవడంలో భాగంగా రష్యా యుద్ధనేరాలకు పాల్పడిందని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ ఆరోపించింది. క్లస్టర్‌ బాంబులను, ఇతర విచక్షణారహిత దాడులకు పాల్పడిందని 40 పేజీల నివేదికలో ఆమ్నెస్టీ తెలిపింది. అయితే క్లస్టర్‌ బాంబుల వాడకంపై నిషేధం విధించాలన్న ఐక్యరాజ్యసమితి ఒప్పందంలో అమెరికా, రష్యా మాత్రం లేవు.

ఇవి కూడా చదవండి

ఉక్రెయిన్‌ దక్షిణ నగరమైన మరియుపోల్‌లో పరిస్థితి ఊహించినదానికిన్నా దారుణంగా ఉందని అక్కడి సైనిక అధికారులు చెబుతున్నారు. అజోవ్‌స్టల్ స్టీల్‌ ఫ్యాక్టరీపై రష్యా జరిపిన దాడుల్లో మరణాల సంఖ్య ఇంకా ఎక్కువేనని అంటున్నారు. ఇప్పటి వరకూ 220 మృత దేహాలను గుర్తించారు. అయితే ఇంకా చాలా మేర ఉక్రెయిన్‌ సైనికులు మృత దేహాలు అక్కడే పడి ఉన్నాయని, వీరిని గుర్తించేందుకు చాలా రోజులు పట్టవచ్చని అంటున్నారు. రష్యా ఇంకా ఎంత కాలం యుద్ధం కొనసాగిస్తుందో చెప్పలేమంటున్న ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. తమ సైనికులను చూసి గర్విస్తున్నానంటున్నారాయన.