రష్యన్ సైన్యం భీకర దాడులతో(Russia Ukraine War) దద్దరిల్లిపోతోంది ఉక్రెయిన్. 25 రోజులుగా కీలక నగరాలపై విరుచుకుపడుతోంది పుతిన్ సేన. అయితే ఇవాళ దాడులు మరింత ఉధృతం చేయనున్నట్టు తెలుస్తోంది. దాదాపు 18నగరాలపై ఒకేసారి రష్యన్ సైన్యం దాడులు చేయొచ్చనే సమాచారంతో అప్రమత్తమైంది ఉక్రెయిన్ ప్రభుత్వం. ఆయా నగరాల్లో వార్ సైరన్లు మోగిస్తోంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్, ఖార్కివ్, మరియుపోల్ సహా పలు ప్రధాన నగరాలపై రష్యన్ ఆర్మీ..మరింత పవర్‌ఫుల్ బాంబ్స్‌తో అటాక్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పోర్ట్ నగరమైన మరియుపోల్‌ను ధ్వంసం చేస్తున్నాయి రష్యన్ బలగాలు. మరియుపోల్‌ను చుట్టుముట్టిన పుతిన్ బలగాలు.. విచ్చలవిడిగా దాడులు చేస్తున్నాయి. రష్యన్ సైన్యం దాడుల్లో అజోవ్‌స్తాల్‌లోని అతిపెద్ద స్టీల్ ప్లాంట్ ధ్వంసమైంది.
మరియుపోల్‌లో ఎటు చూసినా శవాల కుప్పలు, శిథిలాల దిబ్బలే కనిపిస్తున్నాయి. ప్రాణాలతో ఉన్న ప్రజలు ఆకలితో అలమటించిపోతున్నారు. దేశం విడిచి వెళ్లిపోవాలని రష్యన్ సైనికులు బెదిరిస్తున్నారని వాపోతున్నారు స్థానికులు. షెల్టర్లలో ఉన్న మహిళలు, చిన్నారులకు.. ఆహారం, తాగునీరు కూడా అందకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ద్వైపాక్షిక చర్చలకు కట్టుబడి దాడులు ఆపాలని రష్యాకు పిలుపునిచ్చారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.
ఇవి కూడా చదవండి: Sunny Leone: కూతురు నిషాను పట్టించుకోవడం లేదని ఆరోపించిన ట్రోలర్లకు సన్నీలియోన్ కౌంటర్..
BP Control Tips: బీపీ అస్సలు రాకుండా ఉండాలంటే.. ముందు ఈ అలవాట్లకు దూరంగా ఉండండి..