Russia Ukraine War: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులకు ఊరట.. రష్యా కీలక నిర్ణయం

|

Mar 04, 2022 | 1:36 PM

ఇండియన్స్‌ని ఉక్రెయిన్‌ నుంచి క్షేమంగా తీసుకొచ్చేందుకు రష్యా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది. రష్యా బోర్డర్‌కు దగ్గరగా ఉన్న ప్రాంతాల నుంచి షిఫ్ట్‌ చేసేందుకు 130 బస్సులను సిద్ధం చేసింది.

Russia Ukraine War: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులకు ఊరట.. రష్యా కీలక నిర్ణయం
Putin To Arrange Buses
Follow us on

భారతీయుల(indians) తరలింపు విషయంలో రష్యా(Russia) కీలక నిర్ణయం తీసుకుంది. ఇండియన్స్‌ను స్వదేశానికి షిఫ్ట్‌ చేసేందుకు తన వంతు సహకారం అందిస్తోంది. ఇండియన్స్‌ని ఉక్రెయిన్‌(Ukraine) నుంచి క్షేమంగా తీసుకొచ్చేందుకు రష్యా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తోంది. రష్యా బోర్డర్‌కు దగ్గరగా ఉన్న ప్రాంతాల నుంచి షిఫ్ట్‌ చేసేందుకు 130 బస్సులను సిద్ధం చేసింది. అటు.. ఉక్రెయిన్‌లోని ఖార్కీవ్‌, సూమీలకు కూడా బస్సులను పంపుతోంది. మరో వైపు ఇప్పటికే పోలాండ్‌కు వచ్చి ఉన్న విద్యార్థులను.. అక్కడే ఉంచాలన్న ఆలోచనకు ఇండియా వచ్చినట్టు తెలుస్తోంది. కొద్ది రోజులుగా పోలాండ్‌లో ఉంచి.. పరిస్థితుల తీవ్రత ఆధారంగా చర్యలు తీసుకోవాలన్న ప్రయత్నంలో ఉంది. రష్యాకు చేరుకున్న వారి పట్ల కూడా కొంత ఆలస్యం చేసినా ప్రమాదం లేదని.. ముందుగా ఉక్రెయిన్‌లోచిక్కుకున్న వారిని ఇండియాకు తరలించాన్న లక్ష్యంతో పని చేస్తుంది.

మరో వైపు ఇండియా కూడా ఈ విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఇండియర్‌ ఎయిర్‌లైన్స్‌తో పాటు.. ప్రత్యేక నేవీ ఫ్లైట్స్‌ని రంగంలోకి దింపారు. ప్రతి రోజు షటిల్‌ సర్వీస్‌ ఫ్లైట్స్‌లా ఉక్రెయిన్‌-ఇండియా మధ్య చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే రొమేనియా నుంచి ఢిల్లీకి ప్రత్యేక విమానాలు చేరుకుంటున్నాయి. ఇవాళ ఉదయం దాదాపు 219 మంది ఇండియాకు చేరుకున్నారు. వీరందరికి కేంద్ర మంత్రి కైలాశ్‌ చైదరి స్వాగతం పలికారు.

వైద్య విద్యకు కేరాఫ్‌గా మారిన ఉక్రెయిన్‌లో మనవాళ్లు 24 వేల మంది ఉంటారని అంచనా. అయితే యుద్ధానికి ముందు, దాడుల జరుగుతున్న క్రమంలో ఇప్పటి వరకు దాదాపుగా నాలుగు వేల 5వందల మంది వరకు ఇండియాకు చేరుకున్నారు. విదేశాంగ శాఖ లెక్కల ప్రకారం మనవాళ్లు మరో 19 వేల మంది ఉక్రెయిన్‌లో ఇరుక్కుపోయారు.

ఇవి కూడా చదవండి: Russia Ukraine War: అణు విద్యుత్తు కేంద్రంపై బాంబుల వర్షం.. వీడియోను విడుదల చేసిన ఉక్రెయిన్..

Russia Ukraine War Live Updates: న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌ను టార్గెట్ చేసిన రష్యా.. ఆందోలనలో యూరప్ దేశాలు..