Russia Ukraine War: మహిళా పైలెట్లతో పుతిన్ సమావేశం.. ఉక్రెయిన్‌పై యుద్ధంపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..

|

Mar 06, 2022 | 8:15 AM

మహిళా పైలెట్లతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఎంతో ఆలోచించి ఉక్రెయిన్‌పై దాడులు చేశామని, ఊహించిన దాని కంటే ఎక్కువస్థాయిలో పోరు నడుస్తోందన్నారు రష్యా చీఫ్.

Russia Ukraine War: మహిళా పైలెట్లతో పుతిన్ సమావేశం.. ఉక్రెయిన్‌పై యుద్ధంపై ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..
Russia President Putin Meet
Follow us on

ఉక్రెయిన్‌పై యుద్ధం(Russia Ukraine War) గురించి ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌ చేశారు రష్యా అధ్యక్షుడు పుతిన్(Russia President putin). అటు నాటోపై హాట్‌ కామెంట్స్‌ చేశారు. మహిళా పైలెట్లతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఎంతో ఆలోచించి ఉక్రెయిన్‌పై దాడులు చేశామని, ఊహించిన దాని కంటే ఎక్కువస్థాయిలో పోరు నడుస్తోందన్నారు రష్యా చీఫ్. నాటో దేశాలపై సంచల వ్యాఖ్యలు చేశారు రష్య అధ్యక్షుడు పుతిన్. రష్యాపై నిషేధం అంటే యుద్ధంతో సమానం అని వార్నింగ్‌ ఇచ్చారు పుతిన్. నాటో దేశాలు మూల్యం చెల్లించుకోక తప్పదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఉహించినదాని కన్నా ఎక్కువగా ఉక్రెయిన్‌పై భీకరయుద్ధం చేస్తామని, ఉక్రెయిన్‌లో అణ్వాయుధాలు లేకుండా చేస్తామని మాస్‌ కామెంట్స్‌ చేశారు రష్యా చీఫ్. తమ డిమాండ్లు నెరవేరేదాకా యుద్ధం ఆగదని స్పష్టం చేశారు పుతిన్. శాంతి ఒప్పందాన్ని ఉక్రెయిన్ ఉల్లంఘించిందని, ఆరోపించారు రష్యా అధ్యక్షుడు.

రష్యాలో మార్షల్‌ లా అవసరం లేదని, ఉక్రెయిన్‌పై సైనికచర్య చాలా కఠినమైన నిర్ణయమని చెప్పారాయన. అణ్వాయుధాలకు ఉక్రెయిన్‌ నిలయంగా మారకూడదని స్పష్టం చేశారు. అటు యుద్ధం యుద్ధమే, చర్చలు చర్చలే అంటూ ఉక్రెయిన్‌కు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు పుతిన్. ఇప్పటికే రష్యా ఉక్రెయిన్న మధ్య రెండు సార్లు చర్చలు జరిగాయి. ఈరెండు సార్లు ఇరు దేశాలు తమతమ డిమాండ్లపై గట్టిగా పట్టుపట్టడంతో అసంపూర్తిగానే ముగిశాయి.

మూడోసారి బెలారస్ వేదికగా చర్చలకు సిద్ధం అవుతున్నాయి. ఉక్రెయిన్‌ నాటోలో చేరకూడదని లిఖిత పూర్వక హామీ కోసం పట్టుబడుతోంది రష్యా. తూర్పు వైపు డాన్బాస్ ప్రాంతంపై రష్యా ఆధిక్యతను ఒప్పుకోవాలని స్పష్టం చేస్తోంది. క్రిమియాను రష్యాలో అంతర్భాగంగా గుర్తించాలంటూ డిమాండ్ చేస్తోంది. అయితే, తమ భూభాగం నుంచి రష్యా దళాలు ఉపసంహరించుకోవాలని కోరుతోంది ఉక్రెయిన్. తమ సార్వభౌమాధికారంలో రష్యా జోక్యం ఏమిటని ప్రశ్నిస్తోంది ఉక్రెయిన్‌.

ఇవి కూడా చదవండి: Russia Ukraine War Live Updates: ఉక్రెయిన్‌పై ఆగని బాంబుల వర్షం..దద్దరిల్లుతున్న పట్టణాలు.. కుప్పకూలుతున్న భవనాలు..

Job Fair: రౌడీషీటర్లకు బంపర్ ఆఫర్.. పోలీసుల జాబ్‌ మేళాకు భారీ స్పందన..