రష్యాలో భారత్‌కు దౌత్య విజయం.. రష్యా ఆర్మీలోని భారతీయులను విడిచిపెట్టేందుకు పుతిన్‌ అంగీకారం

మై బెస్ట్‌ ఫ్రెండ్‌ మోదీ. భారత్‌-రష్యా బంధం ఏ రేంజ్‌లో ఉందో చెప్పడానికి ఈ ఒక్కమాట చాలు. మాస్కోలో అచ్చంగా ఇదే జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్‌ ఆకాశానికి ఎత్తేశారు. తన బెస్ట్‌ ఫ్రెండ్‌ అంటూ సంబోధించారు.

రష్యాలో భారత్‌కు దౌత్య విజయం.. రష్యా ఆర్మీలోని భారతీయులను విడిచిపెట్టేందుకు పుతిన్‌ అంగీకారం
Narendra Modi, Vladimir Putin,
Follow us

|

Updated on: Jul 09, 2024 | 9:50 AM

మై బెస్ట్‌ ఫ్రెండ్‌ మోదీ. భారత్‌-రష్యా బంధం ఏ రేంజ్‌లో ఉందో చెప్పడానికి ఈ ఒక్కమాట చాలు. మాస్కోలో అచ్చంగా ఇదే జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్‌ ఆకాశానికి ఎత్తేశారు. తన బెస్ట్‌ ఫ్రెండ్‌ అంటూ సంబోధించారు. రష్యాకు వచ్చిన మన ప్రధాని మోదీకి మాస్కో అవతల ఉన్న అధ్యక్షుడి నివాసంలో లభించిన గ్రాండ్‌ వెల్‌కమ్‌ ఇది. అమెరికా, యూరప్‌ తోపాటు మాజీ సోవియట్‌ దేశాలు పుతిన్‌పై కత్తులు నూరుతున్నవేళ, భారత ప్రధాని టూర్‌, రష్యాకు పెద్ద బలాన్ని, గొప్ప రిలీఫ్‌ని ఇచ్చింది. కరోనా తర్వాత ప్రధాని తొలిసారి రష్యా వెళ్లారు.

ఇది పూర్తి అధికారిక కార్యక్రమం కాదు. కానీ మర్యాదపూర్వకంగా సాగిన ప్రైవేట్‌ కార్యక్రమం. పెద్ద ఎస్టేట్‌లా కనిపిస్తున్న ఈ ప్రాంతంలో మోదీ-పుతిన్‌ గంటపాటు చర్చించారు. షేక్‌హ్యాండ్‌లు, ఆలింగనాలు, బ్యాటరీ వాహనాల్లో ప్రయాణిస్తూ, ఇద్దరు నేతలు ప్రపంచ దేశాలను ఆకర్షించారు. భారత్‌-రష్యా మధ్య ఉన్న చిరకాల మైత్రీబంధానికి ఈ మీటింగ్‌ ఒక నిదర్శనం. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరుదేశాధినేతలు ఈ చాయ్‌పే చర్చలో, డిన్నర్‌ మీటింగ్‌లో మాట్లాడుకున్నారు.

ఈ క్రమంలో రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ రష్యా ఆర్మీలో పనిచేస్తున్న భారతీయులను స్వదేశానికి రప్పించే అంశాన్ని అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రస్తావించారు. దీని తరువాత, అధ్యక్షుడు పుతిన్, భారతీయులు త్వరలో దేశానికి తిరిగి వస్తారని ప్రధాని మోదీకి హామీ ఇచ్చారు.

వాస్తవానికి, రష్యా సైన్యంతోపాటు ఉక్రెయిన్‌పై పోరాడటానికి భారతీయ పౌరులను బలవంతంగా తరలిస్తున్నారన్న వార్తలు వచ్చాయి. భద్రతా సహాయకులుగా పని చేసేందుకు భారతీయులను మోసపూరితంగా సరిహద్దులకు పంపుతున్నారు కొందరు ఏజెంట్లు. నవంబర్ 2023 నుండి రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులో దాదాపు 18 మంది భారతీయులు చిక్కుకుపోయారని ఒక ఏజెంట్ సమాచారం ఇచ్చారు. ఈ సమయంలో ఒకరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇద్దరు దేశాధినేతల భేటీతో బలవంతంగా చిక్కుపోయిన భారతీయులకు విముక్తి లభిస్తోంది.

ఇదిలావుంటే, రష్యా అధినేత పుతిన్‌తో ప్రధాని మోదీ ఇప్పటికే డిన్నర్‌ మీటింగ్ నిర్వహించారు. ఇవాళ రెండు దేశాల ప్రతినిధుల స్థాయి చర్చలు జరుగుతాయి. అలాగే రొసాటోమ్‌ పెవిలియన్‌ను ప్రధాని మోదీ సందర్శిస్తారు. న్యూక్లియర్‌ టెక్నాలజీలో రష్యా సాధించిన విజయాలకు సంబంధించిన ఎగ్జిబిషన్‌లో మోదీ పాల్గొంటారు. ఆ తర్వాత 22వ రష్యా-ఇండియా సదస్సులో పుతిన్‌తో కలిసి మోదీ పాల్గొంటారు.

అయితే ప్రధాని మోదీ రష్యా టూర్‌పై అమెరికా ఆచితూచి స్పందించింది. ఉక్రెయిన్‌ విషయంలో ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు అనుగుణంగానే, మోదీ స్పందించాలని అగ్రరాజ్యం కోరింది. భారత్‌ తమకు వ్యూహాత్మక భాగస్వామి అనీ, అయితే ఇందులో రష్యా విషయంలో సంబంధాలు కూడా ముఖ్యమేనని అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్‌ చెప్పారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

ఢిల్లీకి హిట్‌మ్యాన్, చెన్నైకి పంత్.. మెగా వేలానికి ముందుగా..
ఢిల్లీకి హిట్‌మ్యాన్, చెన్నైకి పంత్.. మెగా వేలానికి ముందుగా..
టెలికాం అధికారులమంటూ ఫోన్‌ చేశారు.. కోట్ల రూపాయలు దోచేశారు..
టెలికాం అధికారులమంటూ ఫోన్‌ చేశారు.. కోట్ల రూపాయలు దోచేశారు..
6 ఏళ్లుగా ఆడుతున్నారు.. లంకలో మాత్రం తొలిసారి బరిలోకి
6 ఏళ్లుగా ఆడుతున్నారు.. లంకలో మాత్రం తొలిసారి బరిలోకి
హీరో సూర్య ఆస్తులు ఎన్ని కోట్లు ఉంటాయంటే..
హీరో సూర్య ఆస్తులు ఎన్ని కోట్లు ఉంటాయంటే..
బూడిద గుమ్మడిని కేవలం దిష్టికాయగానే చూస్తున్నారా..? ప్రయోజనాలు
బూడిద గుమ్మడిని కేవలం దిష్టికాయగానే చూస్తున్నారా..? ప్రయోజనాలు
ఏఐతో ఉద్యోగాలకు ముప్పు తప్పదా.? ఆర్థిక సర్వేలో ఆసక్తికర విషయాలు..
ఏఐతో ఉద్యోగాలకు ముప్పు తప్పదా.? ఆర్థిక సర్వేలో ఆసక్తికర విషయాలు..
నయనతారతో బిగ్‏బాస్ కంటెస్టెంట్ లవ్ స్టోరీ.. షాకవుతున్న నెటిజన్స్.
నయనతారతో బిగ్‏బాస్ కంటెస్టెంట్ లవ్ స్టోరీ.. షాకవుతున్న నెటిజన్స్.
అతిగా నిద్రపోతున్నారా.. జాగ్రత్త! మీరు డేంజర్‌లో ఉన్నట్లే..
అతిగా నిద్రపోతున్నారా.. జాగ్రత్త! మీరు డేంజర్‌లో ఉన్నట్లే..
వరుసవిజయాలతో ఇంగ్లండ్ దూకుడు.. డబ్ల్యూటీసీలో భారత్, ఆసీస్‌కు షాక్
వరుసవిజయాలతో ఇంగ్లండ్ దూకుడు.. డబ్ల్యూటీసీలో భారత్, ఆసీస్‌కు షాక్
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నావా..? హీరోయిన్‏పై ట్రోల్స్..
ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నావా..? హీరోయిన్‏పై ట్రోల్స్..
బీ అలెర్ట్.! కోనసీమ వాసులకు హెచ్చరిక..
బీ అలెర్ట్.! కోనసీమ వాసులకు హెచ్చరిక..
రోజూ ఒకటైనా తినండి.. ఫలితం మీరే చూడండి.!
రోజూ ఒకటైనా తినండి.. ఫలితం మీరే చూడండి.!
మనుషుల్లో వృద్ధాప్యానికి కారణం ఇదే.. గుర్తించిన శాస్త్రవేత్తలు.!
మనుషుల్లో వృద్ధాప్యానికి కారణం ఇదే.. గుర్తించిన శాస్త్రవేత్తలు.!
జిమ్‌ చేస్తున్న వ్యక్తిపై ట్రైనర్‌ దాడి.. ఏం జరిగిందంటే.! వీడియో.
జిమ్‌ చేస్తున్న వ్యక్తిపై ట్రైనర్‌ దాడి.. ఏం జరిగిందంటే.! వీడియో.
కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తికి ట్రంప్‌ ప్రత్యేక నివాళి.! వీడియో
కాల్పుల్లో మృతి చెందిన వ్యక్తికి ట్రంప్‌ ప్రత్యేక నివాళి.! వీడియో
బోయ్.. ఆ వీడియోలు చూస్తే.. బరువెక్కేస్తారు.! అందులో నిజమెంత.?
బోయ్.. ఆ వీడియోలు చూస్తే.. బరువెక్కేస్తారు.! అందులో నిజమెంత.?
వారికి డెంగ్యూతో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు! నిపుణుల షాకింగ్‌..
వారికి డెంగ్యూతో బ్రెయిన్ స్ట్రోక్ ముప్పు! నిపుణుల షాకింగ్‌..
ఆ తాగునీటితో క్యాన్సర్‌.. ఏం జరిగిందంటే.! వీడియో..
ఆ తాగునీటితో క్యాన్సర్‌.. ఏం జరిగిందంటే.! వీడియో..
హాస్టల్‌ భోజనంలో పురుగులు, బొద్దింకలు ప్రత్యక్షం.! వీడియో వైరల్.
హాస్టల్‌ భోజనంలో పురుగులు, బొద్దింకలు ప్రత్యక్షం.! వీడియో వైరల్.
ముందు పేలుడు. ఆపై అంతా చీకటి.. రైలు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి.!
ముందు పేలుడు. ఆపై అంతా చీకటి.. రైలు ప్రమాదంపై ప్రత్యక్ష సాక్షి.!