Russia Ukraine War: రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై హత్యాయత్నం.. అధికారిక భవనంపై డ్రోన్లతో దాడులు..
ఇప్పుడు క్రెమ్లిన్‌పై ఉగ్రవాదుల మాదిరిగా ఉక్రెయిన్ దాడి చేస్తోందని రష్యా ఆరోపించింది. క్రెమ్లిన్‌పై డ్రోన్‌తో దాడికి ఉక్రెయిన్ ప్రయత్నించిందని.. దాని ఉగ్రవాద చర్యగా తాము పరిగణిస్తున్నామని తెలిపింది. ఈ దాడికి త్వరలోనే ప్రతికార చర్య..

రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఏడాదికి పైగా ఆగలేదు. ఇప్పుడు క్రెమ్లిన్‌పై ఉగ్రవాదుల మాదిరిగా ఉక్రెయిన్ దాడి చేస్తోందని రష్యా ఆరోపించింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసం ఉండే క్రెమ్లిన్‌పై ఈ దాడి జరిగింది. ఈ దాడి వివరాలను అధికారిక నివాస అధికారులు అంతర్జాతీయ మీడియాకు తెలిపారు. క్రెమ్లిన్‌పై డ్రోన్‌తో దాడికి ఉక్రెయిన్ ప్రయత్నించిందని.. దాని ఉగ్రవాద చర్యగా తాము పరిగణిస్తున్నామని తెలిపింది. ఈ దాడికి త్వరలోనే ప్రతికార చర్య ఉంటుందని.. గట్టి సమాధానం ఇస్తుందని హెచ్చరించింది. ఉక్రెయిన్ ప్రయోగించిన రెండు డ్రోన్‌లను కూల్చివేసినట్లు మే 3 బుధవారం క్రెమ్లిన్ అధికారులు తెలిపారు. రష్యా ప్రభుత్వం తరపున, కీవ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను చంపడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలోని వార్తా సంస్థలు ఒక ప్రకటనలో పేర్కొన్నాయి. దాడి జరిగిన ఆ సమయంలో పుతిన్ క్రెమ్లిన్‌లో లేరని.. నోవో-ఒగారియోవో నివాసం నుంచి పనిచేస్తున్నారని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ RIA నోవోస్టికి తెలిపారు. పుతిన్ సురక్షితంగా ఉన్నారని, అతని షెడ్యూల్ మారలేదని క్రెమ్లిన్ తెలిపింది.
దాడి వీడియోను ఇక్కడ చూడండి..
#WATCH | Russia today alleged that there were attempts by Ukraine to assassinate President Putin, saying it was a “terrorist attack” while claiming it shot down drones over the residence of Putin
(Video: Russia’s RT news) pic.twitter.com/6b7jkeYluT
— ANI (@ANI) May 3, 2023
రష్యా ఆరోపణలపై ఉక్రేనియన్ అధికారులు ఇప్పటి వరకు స్పందించలేదు. అయితే, క్రెమ్లిన్ చేసిన ఆరోపణలపై ఎటువంటి ఆధారాలు సమర్పించలేదు. మే 9న రష్యా జరుపుకునే విక్టరీ డేకి ముందు పుతిన్ జీవితంపై ఉద్దేశపూర్వకంగా జరిగిందని ఆరోపించింది. అయితే, ఆ రోజు షెడ్యూల్ ప్రకారం సైనిక కవాతు జరుగుతుందని క్రెమ్లిన్ ప్రతినిధి పెస్కోవ్ తెలిపారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం