Roses Facts Quiz: గులాబీ పువ్వు మొదట ఏ దేశంలో వెలుగులోకి వచ్చింది.. అతి పెద్ద, ఖరీదైన పువ్వు ఏదో తెలుసా?

|

May 15, 2023 | 11:58 AM

ప్రేమికుల నుంచి ప్రతి బంధానికి ఒకొక్క రకం గులాబీని చిహ్నంగా భావిస్తారు. తనకు  రక్షణగా నిలిచే ముళ్ల మధ్య అందంగా ఠీవిగా నిలిచే గులాబీని చూస్తే దాదాపు ప్రతి ఒక్కరి హృదయం సంతోషిస్తుంది. మీరు గులాబీ పువ్వు ప్రేమికుల.. అయితే మీకు గులాబీ పువ్వులకు సంబంధించిన ప్రశ్నలను చెప్పగలరేమో ప్రయత్నించండి.   

Roses Facts Quiz: గులాబీ పువ్వు మొదట ఏ దేశంలో వెలుగులోకి వచ్చింది.. అతి పెద్ద, ఖరీదైన పువ్వు ఏదో తెలుసా?
Rose Flowers
Follow us on

ప్రకృతి మనిషికి అనేక అద్భుతమైన వరాలను అందించింది. ప్రకృతిలో అత్యంత అందమైన సృష్టిలో ఒకటి పువ్వులు. పువ్వులు చూస్తే చాలు దాదాపు అందరి ముఖంలో చిరునవ్వు పెదవులపై విరుస్తుంది. ప్రపంచంలో కోట్లాది రకాల పువ్వులున్నాయి. దేనికదే ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నాయి.. అయితే గులాబీ మాత్రం వెరీ వెరీ స్పెషల్.. ప్రేమికుల నుంచి ప్రతి బంధానికి ఒకొక్క రకం గులాబీని చిహ్నంగా భావిస్తారు. తనకు  రక్షణగా నిలిచే ముళ్ల మధ్య అందంగా ఠీవిగా నిలిచే గులాబీని చూస్తే దాదాపు ప్రతి ఒక్కరి హృదయం సంతోషిస్తుంది. మీరు గులాబీ పువ్వు ప్రేమికుల.. అయితే మీకు గులాబీ పువ్వులకు సంబంధించిన ప్రశ్నలను చెప్పగలరేమో ప్రయత్నించండి.

a) తొలిసారిగా గులాబీ మొక్క ప్రపంచంలోని ఏ దేశంలో కనిపించింది?

 * జర్మనీ   * ఫ్రాన్స్  * అమెరికా *రష్యా

ఇవి కూడా చదవండి

b) గులాబీ పువ్వు ఎన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నదంటే..? 

* 14 వేల సంవత్సరాలు * 12 వేల సంవత్సరాలు * 10 వేల సంవత్సరాలు * 8 వేల సంవత్సరాలు

c) ప్రపంచంలోని మొట్టమొదటి గులాబీ ఏ రంగులో ఉందో తెలుసా? 

*ఎరుపు  *గులాబీ రంగు *నలుపు *తెలుపు

d) ఏ దేశానికి చెందిన జాతీయ పుష్పం గులాబీ?

* బల్గేరియా  *రష్యా   *జపాన్   *బహ్రెయిన్

e)ప్రపంచంలో అత్యంత ఖరీదైన గులాబీ పేరు ఏమిటో మీకు తెలుసా ?

* నీలం *జూలియట్ *నారింజ *నలుపు

f) ప్రపంచంలోనే అత్యంత అరుదైన గులాబీ ఏ రంగులో ఉంటుంది?

*నలుపు  *నీలం  *గులాబీ రంగు  *నారింజ

g) ఇప్పటివరకు పెరిగిన అతిపెద్ద గులాబీ దాదాపు 33 అంగుళాలు. ఆ గులాబీ పువ్వు ఏ రంగు చెప్పగలరా?

* గులాబీ రంగు  *ఎరుపు  *నీలం  *తెలుపు

h) ప్రపంచంలోనే అతిపెద్ద గులాబీ తోట ఏ దేశంలో ఉందో తెలుసా? 

*బ్రిటన్   *ఇటలీ  *జర్మనీ  *అమెరికా

i) ప్రపంచంలో గులాబీలను అత్యధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏదంటే? 

*బల్గేరియా *రష్యా *జపాన్ *ఇటలీ

j) ఏ రకం గులాబీని అంతరిక్షంలోకి పంపిందో తెలుసా? 

*ఓవర్ నైట్ సెన్సేషన్ గులాబీ *లాస్ట్ నైట్ సెన్సేషన్ గులాబీ *రోజు సెన్సేషన్ గులాబీ *మిడ్ నైట్ సెన్సేషన్ గులాబీ

సమాధానం మీకోసం : 

a)జర్మనీ

b)12 వేల సంవత్సరాలు

c)గులాబీ రంగు

d)బల్గేరియా

e)జూలియట్

f)నీలం

g)గులాబీ రంగు

h)ఇటలీ

i)బల్గేరియా

j)ఓవర్ నైట్ సెన్సేషన్ గులాబీ

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..