Ukraine-Russia Crisis: పెద్ద ప్రమాదమే పొంచివుంది.. రష్యా బలగాలు వెనక్కిపై జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు

|

Apr 02, 2022 | 1:44 PM

Ukraine-Russia Crisis: రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ద వాతావరణ కొనసాగుతోంది. తమ భూభాగంపై ఉక్రెయిన్‌ దాడులు కొనసాగిస్తోందని రష్యా ఆరోపిస్తుండగా, ఉక్రెయిన్‌..

Ukraine-Russia Crisis: పెద్ద ప్రమాదమే పొంచివుంది.. రష్యా బలగాలు వెనక్కిపై జెలెన్‌స్కీ కీలక వ్యాఖ్యలు
Follow us on

Ukraine-Russia Crisis: రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ద వాతావరణ కొనసాగుతోంది. తమ భూభాగంపై ఉక్రెయిన్‌ దాడులు కొనసాగిస్తోందని రష్యా ఆరోపిస్తుండగా, ఉక్రెయిన్‌ మాత్రం అలాంటివి అవాస్తవాలని ఖండిస్తోంది. ఇక ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. ఉక్రెయిన్‌లో యుద్ధ వ్యూహాన్ని మార్చే క్రమంలో ఉన్న రష్యా శుక్రవారం ఉక్రెయిన్‌ (Ukraine) రాజధాని కీవ్‌ (Kyiv)శివారు నుంచి కొన్ని బలగాలను ఉపసంహరించుకుంది. నగరానికి దాదాపు 18 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఆంటోనవ్‌ విమానాశ్రయం (Airport) నుంచి బలగాలు పూర్తిగా వైదొలిగినట్లు ఉపగ్రహ చిత్రాల్లో కనిపించింది. రష్యా సైనికులు  (Russia Army)నెమ్మ నెమ్మదిగా ఉపసంహరించుకుంటున్నప్పటికీ, ఇంకా దాడులు కొనసాగుతున్నాయని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelenskyy) తాజా వీడియో సందేశం ఇచ్చారు.

వెనక్కి వెళ్తున్న రష్యన్‌ బాలగాలు పెద్ద ఉపద్రవాన్నే సృష్టించి వెళ్తున్నాయని జెలెన్‌స్కీ శనివారం తమ దేశ పౌరులను హెచ్చరించారు. రాజధాని నుంచి వెనుదిగుతున్న రష్యా సైనికులు ఆయా ప్రాంతాల్ఓల ల్యాండ్‌ మైన్లను ఉంచి వెళ్తున్నారని, అలాగే ఇళ్లు, శవాల దగ్గర మైన్లను పెట్టారని ఆయన వెల్లడించారు. వారి ఉపసంహరణ వెనుక పెద్ద ప్రమాదమే పొంచివుందని జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. సొంత ప్రాంతాలకు తిరిగి వచ్చేవారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇంకా సాధారణ జీవితమే గడపాలని, తిరిగి ఎలాంటి దాడులు జరగవని ఉక్రెయిన్‌ సైన్యం హామీ ఇచ్చే వరకు వేచి చూడాలని సూచించారు.

రష్యా సైనికుల ఉపసంహరణపై ఉక్రెయిన్‌ జాతీయ భద్రతా, రక్షణ మండలి కార్యదర్శి ఒలెగ్గీ డేనీలోవ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌ను నాశనం చేయాలని ఆలోచనను రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అంత సులభంగా వదిలి పెట్టరన్నారు. దాడులను మరింత తీవ్రతరం చేసేలా బలగాలను పునరుద్దరిస్తున్నారని, మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. రష్యా సైనికులు స్వచ్చంధంగా వెనక్కి వెళ్తున్నారని ఎట్టి పరిస్థితుల్లోనూ భావించవద్దని దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దాడుల వ్యూహంపై పునరాలోచన చేసుకునేందుకు రష్యన్‌ సైనికులు వెనుదిరిగి వెళ్తున్నారని, మే 9వ తేదీ లక్ష్యంగా పెట్టుకున్నారని, అప్పటి వరకు విజయం సొంతం చేసుకోవాలని భావిస్తున్నారని ఒలెగ్జీ ఓ టీవీ ఇంటర్వ్యూలో ప్రజలనుద్దేశించి అన్నారు.

ఇవి కూడా చదవండి:

Imran Khan: గద్దె దింపేందుకు అమెరికా కుట్ర.. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు..

Sri Lanka Crisis: శ్రీలంకలో దారుణ పరిస్థితులు.. సంచలన ప్రకటన చేసిన ఆ దేశ అధ్యక్షుడు..