Reddit: లేఆఫ్ ప్రకటించిన మరో ప్రముఖ కంపెనీ రెడ్డిట్.. ఎంతమందిపై వేటు పడనుందంటే

|

Jun 07, 2023 | 1:56 PM

ఇటీవల చాలా కంపెనీల్లో ముఖ్యంగా ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. అమెజాన్, మొక్రోసాఫ్ట్, మెటా వంటి దిగ్గజ కంపెనీలు సైతం వేలాది మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపేంచాశాయి. అయితే తాజాగా ఇదే వరుసలో ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ రెడ్డిట్ కూడా చేరింది.

Reddit: లేఆఫ్ ప్రకటించిన మరో ప్రముఖ కంపెనీ రెడ్డిట్.. ఎంతమందిపై వేటు పడనుందంటే
Reddit
Follow us on

ఇటీవల చాలా కంపెనీల్లో ముఖ్యంగా ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. అమెజాన్, మొక్రోసాఫ్ట్, మెటా వంటి దిగ్గజ కంపెనీలు సైతం వేలాది మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపేంచాశాయి. అయితే తాజాగా ఇదే వరుసలో ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ రెడ్డిట్ కూడా చేరింది. ఉద్యోగుల తొలగించేసేందుకు ఈ సంస్థ కూడా సిద్ధమైంది. ప్రస్తుతం రెడ్డిట్‌ సంస్థలో ప్రపంచ వ్యాప్తంగా 2,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అందులో దాదాపు 5 శాతం ఉద్యోగులను లే ఆఫ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ కంపెనీ నిర్ణయంతో దాదాపు 90 మందిపై లేఆఫ్స్‌ వేటు పడనుంది.

ఈ విషయాన్ని కంపెనీ సీఈవో స్టీవ్‌ హుఫ్‌మన్‌ తమ ఉద్యోగులకు ఈమెయిల్‌ ద్వారా సమాచారం తెలియజేశాడు. ఇదే సమయంలో కొత్తగా నియమించుకునే సిబ్బందిని సైతం గణనీయంగా తగ్గించుకోవాలని సంస్థ భావిస్తోన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే మొదట 300 మంది కొత్తవాళ్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న రెడ్డిట్.. ఇప్పుడు ఆ సంఖ్యను 100కే పరిమితం చేసేసినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..