పెళ్లి కాకపోయిన పర్వాలేదు. రిజిస్టర్ చేసుకోండి పిల్లల్ని కనండి అంటోంది చైనా ప్రభుత్వం. ఇంతకు ముందు కేవలం వివాహిత జంటలే చట్టబద్ధంగా పిల్లలను కనేలా అనుమతి ఇచ్చింది. కానీ ఇప్పుడు పెళ్లి కాకపోయినా పర్వాలేదు చట్టబద్ధంగా పిల్లలను కనండి అని ప్రోత్సహిస్తోంది అక్కడి ప్రభుత్వం. పెళ్లి కానీ వారు ఎవరైనా తమ కుటుంబాన్ని పెంచుకోవాలనుకుంటే ఓకే అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చైనాలో జననాల రేటు దారుణంగా పడిపోవటంతో దాన్ని పెంచే క్రమంలో ఈ ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. నైరుతీ ప్రావిన్స్‌లో సిచువాన్ ఐదో అత్యధిక జనాభా కలిగిన ప్రాంతం. ఈ ప్రాంతం 60 ఏళ్ల కంటే పైబడినవారి పరంగా ఏడో స్థానంలో ఉంది. ఈ మధ్య కాలంలో వివాహాలు, జననాల రేటు పడిపోవడంతో ఈ నిబంధనలను తీసుకువచ్చింది. ఫిబ్రవరి 15 నుంచి కొత్త నిబంధనలు అమలు చేయనుంది చైనా ప్రభుత్వం.
వివాహిత జంటలే కాదు పిల్లలు కావాలనుకునే వారంతా అధికారుల దగ్గర తమ పేర్లు నమోదు చేసుకుని కోరుకున్నంత మంది పిల్లలని కనవచ్చని స్పష్టం చేసింది. ఆరు దశాబ్దాలలో మొదటిసారి చైనా జనాభా తగ్గిపోయింది. దీన్ని చారిత్రాత్మక మలుపుగా చెప్తున్నారు అక్కడి అధికారులు. దీర్ఘకాలిక సమతుల్య జనాభాను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది సిచువాన్ ఆరోగ్య కమిషన్. జనాభాను పెంచేలా ప్రజలకు మరిన్ని ప్రోత్సహాకాలు అందిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. వైద్య బిల్లులు కవర్ అయ్యేలా ప్రసూతి బీమా, ప్రసూతి సెలవుల సమయంలో జీతాన్ని అందించేలా వెసులబాటు వంటి ప్రోత్సహాకాలను అందింనున్నారు. ఇది ఒంటరిగా జీవించే మహిళలు, పురుషులకు కూడా వర్తిస్తుందని చెప్తోంది చైనా ప్రభుత్వం.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..