Mass Shooting: మెక్సికో నైట్‌క్లబ్‌లో కాల్పుల మోత.. ఎనిమిది మంది మృతి.. పెరుగుతున్న మృతుల సంఖ్య..

జెరెజ్‌ టౌన్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో సాయుధ దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Mass Shooting: మెక్సికో నైట్‌క్లబ్‌లో కాల్పుల మోత.. ఎనిమిది మంది మృతి.. పెరుగుతున్న మృతుల సంఖ్య..
Mass Shooting In Florida
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 31, 2023 | 8:26 AM

మెక్సికోలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. జెరెజ్‌ టౌన్‌లోని ఓ నైట్‌క్లబ్‌లో సాయుధ దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. దీంతో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. దుండగులు పెద్ద సంఖ్యలో ఆయుధాలతో రెండు వాహనాల్లో ఎల్‌వానాడిటో నైట్‌క్లబ్‌కు చేరుకొని, అక్కడున్న జనంపై కాల్పులు జరిపారని పోలీసులు వెల్లడించారు. ఈ కాల్పుల్లో ఆరుగురు అక్కడికక్కడే మరణించారని, ఆసుపత్రి చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారని పేర్కొన్నారు.

ఇప్పుడు కాల్పుల ఘటనలు సర్వసాధారణమైపోయాయి. వివిధ నగరాల్లో ఇలాంటి ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. అమెరికాలోని ఫ్లోరిడా నగరంలో మరోసారి కాల్పుల ఘటన వెలుగు చూసింది. ఇక్కడ జరిగిన కాల్పుల్లో 9 మంది గాయపడ్డారు. లేక్‌ల్యాండ్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రకారం, ఫ్లోరిడాలో సామూహిక కాల్పుల సంఘటన జరిగింది. ఇందులో పలువురు గాయపడ్డారు. అయితే ఈ కాల్పులకు సంబంధించిన మరింత సమాచారం ఇంకా వెల్లడి కాలేదు.

ఈ కాల్పుల్లో మొత్తం 10 మంది గాయపడినట్లు సమాచారం. కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటన అనంతరం ముదురు నీలం రంగు సెడాన్ కారులో నిందితులు అక్కడి నుంచి పారిపోయినట్లుగా సమాచారం. కారులోపలి నుంచే కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది.

గాయపడిన వారందరూ 20-35 సంవత్సరాల మధ్య ఉంటారని తెలుస్తోంది. వాహనాన్ని గుర్తించి నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. ఘటనాస్థలి నుంచి పోలీసులు కొన్ని డ్రగ్స్‌ను కూడా కనుగొన్నారు. ఇది మాదకద్రవ్యాలకు సంబంధించిన కేసు అని తేల్చారు. అయితే, ఈ కేసుతో దీనికి సంబంధం ఉందా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. లేక్‌ల్యాండ్‌లో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం

ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు తీవ్ర అస్వస్థత..
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు
ఫామ్‌లోకి వచ్చిన క్రికెట్ గాడ్ కొడుకు