ఐక్యరాజ్యసమితి కార్యాలయం ముందు నిరసన ప్రదర్శనలు.. ఆందోళనకు దిగిన బాల్టిస్తాన్ నిరసనకారులు

స్విట్జర్లాండ్‌లోని జెనీవాలోని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (UNHRC) కార్యాలయం వెలుపల..

ఐక్యరాజ్యసమితి కార్యాలయం ముందు నిరసన ప్రదర్శనలు.. ఆందోళనకు దిగిన బాల్టిస్తాన్ నిరసనకారులు
Pok And Gilgit Baltistan

Updated on: Sep 26, 2021 | 11:10 AM

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (POK), గిల్గిట్-బాల్టిస్తాన్ నుండి రాజకీయ కార్యకర్తలు అదృశ్యంపై మానవ హక్కుల కార్యకర్తలు ఐక్యరాజ్యసమితి కార్యాలయం(UNHRC) ముందు ఆందోళనకు దిగారు. అక్కడ ఏర్పాటు చేసిన తీవ్రవాద శిబిరాలను వెంటనే కూల్చివేయాలని వారు డిమాండ్ చేశారు. సహజ వనరుల దోపిడీతోపాటు భూకబ్జాలను ఆపాలని నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మానవ హక్కుల మండలి 48 వ సమావేశంలో జరుగుతున్న సమయంలో వీరు నిరసనలకు దిగడం పెద్ద చర్చకు దారి తీసింది. ఈ నిరసన కార్యక్రమంలో యునైటెడ్ కాశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ (యుపీఎన్పీ), స్విస్ కాశ్మీర్ హ్యూమన్ రైట్స్, జమ్ము కశ్మీర్ ఇంటర్నేషనల్ పీపుల్స్ అలయన్స్ (జెకెఐపీఏ) కార్యకర్తలు పాల్గొన్నారు.

వీరు పాకిస్తాన్‌కు వ్యతిరేక నినాదాలు చేశారు. POK లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను తొలగించాలని డిమాండ్ చేశారు. గత నెలలో పాకిస్తాన్ వ్యూహాత్మకంగా ఉన్న గిల్గిత్-బాల్టిస్తాన్‌కు తాత్కాలిక ప్రావిన్షియల్ హోదాను కల్పించే చట్టాన్ని ఖరారు చేసింది. గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతాలతో సహా మొత్తం కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ము కశ్మీర్, లడఖ్ మొత్తం భారతదేశంలో అంతర్భాగమని భారత్ ఇప్పటికే తెలిపింది.

పాకిస్తాన్‌లో 5 మిలియన్ల చైనీయులు..

రాబోయే 4 సంవత్సరాలలో చైనీయులతో పాకిస్తాన్‌ నిండిపోనుంది.  సుమారు 5 మిలియన్ల మంది చైనా పౌరులు పాకిస్తాన్‌లకి ఎంట్రీ కానున్నారు. తాజాగా ఓ నివేదిక ఈ వివరాలను వెల్లడించింది. పాకిస్తాన్ హెల్త్ సర్వీసెస్ అకాడమీ చైనా పౌరుల సేవలను వినియోగించుకోనుంది. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌తోపాటు ఇతర ప్రాజెక్టులలో పని చేసేందుకు వారు పాకిస్తాన్‌లోకి రానున్నారు. వీరంతా ముందుగా POK, గిల్గిత్-బాల్టిస్తాన్‌లో వారి పనిని మొదలు పెట్టనున్నారు. ఇక్కడి నుంచే చైనీయులు తన ప్రాజెక్టులను వేగంగా అభివృద్ధి చేస్తోంది. చైనా చేస్తున్న నిర్మాణ పనులను ఇక్కడి పౌరులు తరచుగా వ్యతిరేకిస్తారు.

ఇవి కూడా చదవండి:  AP Government: ఇక ఏపీలో అది కుదరదంటే.. కుదరదు.. కొత్త చట్టం తీసుకొచ్చే యోచనలో సర్కార్..

Elon Musk: ప్రపంచంలోని అత్యంత ధనవంతుడు బ్రేకప్ చెప్పాడు.. 3 ఏళ్ల బంధం విడిపోవడానికి కారణం అదేనట..