AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi In France: నా స్నేహితుడిని కలవడం చాలా సంతోషంగా ఉంది.. ప్రధాని మోదీ

PM Modi In France: ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ను కలిశారు. ఈక్రమంలోనే ఆయన మోదీని ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఏఐ యాక్షన్ సమ్మిట్‌కు ముందు అధ్యక్షుడు మాక్రాన్ ప్రధాని మోదీ, యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో సహా అతిథులకు విందు..

PM Modi In France: నా స్నేహితుడిని కలవడం చాలా సంతోషంగా ఉంది.. ప్రధాని మోదీ
Subhash Goud
|

Updated on: Feb 12, 2025 | 1:32 PM

Share

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లిన విషయం అందరికీ తెలిసిందే. 3 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ వెళ్లగా.. సోమవారం రోజు ఉదయం అక్కడకు చేరుకున్నారు. ఏఐ శిఖరాగ్ర సమావేశానికి ముందుగా ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో సమావేశం అయ్యారు. అలాగే విందులో కూడా పాల్గొన్నారు. అక్కడే అమెరికా ఉఫాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను సైతం కలుసుకున్నారు. అయితే తాజాగా దీనిపై స్పందిస్తూ ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. అందులో తన స్నేహితుడిని కలవడం చాలా సంతోషంగా ఉందంటూ ట్వీట్‌ చేశారు. మరి ఆ స్నేహితుడు ఎవరో తెలుసుకుందాం.

ముందుగా ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ను కలిశారు. ఈక్రమంలోనే ఆయన మోదీని ఆత్మీయంగా కౌగిలించుకున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఏఐ యాక్షన్ సమ్మిట్‌కు ముందు అధ్యక్షుడు మాక్రాన్ ప్రధాని మోదీ, యూఎస్ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో సహా అతిథులకు విందు ఇచ్చారు. ఈక్రమంలోనే ముగ్గురు నాయకులు ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ కనిపించారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనలో ఒక ప్రత్యేక అంశం ఏమిటంటే అధ్యక్షుడు మాక్రాన్ ఆయనకు ఇచ్చిన సమయం, గౌరవం. మొదటి రోజు అధ్యక్షుడు మాక్రాన్ ప్రధాని మోదీ ఇచ్చిన విందులో ఆయనతో గడిపారు.

మరోవైపు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు. అందులో ఫ్రాన్స్ అధ్యక్షుడు, తన స్నేహితుడు అయిన ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ను కలవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే ఆయనను ఆలింగనం చేసుకున్న ఫొటోతో పాటు ఆత్మయంగా మాట్లాడుతున్న ఫొటోను షేర్ చేశారు. దీంతో పాటే మరో పోస్ట్ పెట్టిన మోదీ.. అక్కడి ప్రజలు మర్చిపోలేని స్వాగతాన్ని పలికారని చెప్పారు. భారత ప్రవాసులకు కృతజ్ఞతలు చెబుతూనే.. వారి విజయాల పట్ల గర్వంగా ఉందని వెల్లడించారు.

స్నేహానికి ఒక అసాధారణ చిహ్నంగా, వారు ఉమ్మడి మోటారుకేడ్‌లో, ఒకే విమానంలో మార్సెయిల్‌కు ప్రయాణించారు. అధ్యక్షుడు మాక్రాన్ ప్రధాని మోదీ దిగిన వెంటనే మార్సెయిల్‌లో వర్కింగ్ డిన్నర్‌కు ఆతిథ్యం ఇచ్చారు. ఈరోజు అధ్యక్షుడు మాక్రాన్ మార్సెయిల్‌లో భారత కాన్సులేట్‌ను ప్రారంభించడానికి ప్రధాని మోదీతో కలిసి వెళ్లడంతో ఈ ప్రత్యేక బంధం మరింతగా వెలుగులోకి వస్తుంది. మాక్రాన్ లాంటి నాయకుడు ఏ ప్రపంచ నాయకుడికైనా ఇంత సాన్నిహిత్యం, సమయం ఇవ్వడం చాలా అరుదు అని అన్నారు మోదీ.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు
వారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. నేరుగా అకౌంట్లోకే డబ్బులు
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
అత్యంత ప్రమాదకరమైన కుక్కలు ఇవే..
విద్యార్థుల విహారయాత్రలో విషాదం.. ఒకేసారి ఢీకొన్ని 4 బస్సులు
విద్యార్థుల విహారయాత్రలో విషాదం.. ఒకేసారి ఢీకొన్ని 4 బస్సులు
మీరు కలలో నడుస్తున్నట్లు చూడటం శుభమా లేక అశుభమా?
మీరు కలలో నడుస్తున్నట్లు చూడటం శుభమా లేక అశుభమా?
ఆ నిర్మాత నేను హీరో అంటే సినిమా చేయనని వెళ్లిపోయాడు.. ధనరాజ్
ఆ నిర్మాత నేను హీరో అంటే సినిమా చేయనని వెళ్లిపోయాడు.. ధనరాజ్
అర్ధరాత్రి గ్రామంలో పెద్దపులి స్వైర విహారం.. ఆవులను చంపి విధ్వంసం
అర్ధరాత్రి గ్రామంలో పెద్దపులి స్వైర విహారం.. ఆవులను చంపి విధ్వంసం
Video: రవిశాస్త్రిని కాపీ కొట్టబోయి అడ్డంగా బుక్కైన రమీజ్ రాజా..
Video: రవిశాస్త్రిని కాపీ కొట్టబోయి అడ్డంగా బుక్కైన రమీజ్ రాజా..
హైదరాబాద్‌లో మరో భారీ రోడ్డు.. ఈ ప్రాంతాల మీదుగానే..
హైదరాబాద్‌లో మరో భారీ రోడ్డు.. ఈ ప్రాంతాల మీదుగానే..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
ఆ హీరో వల్లే ఉదయ్ కిరణ్‏కు ఛాన్స్.. డైరెక్టర్ తేజ..
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట
చికెన్‌-మటన్‌ ఇష్టపడని వారి కోసం వెజిటేరియన్‌ మటన్‌! పోషకాల పుట్ట