PM Modi: మా లక్ష్యం అదే.. COP33 సమ్మిట్‌ను భారత్‌లో నిర్వహించండి.. ప్రపంచ నేతలకు ప్రధాని మోదీ సూచన..
COP28 climate summit in Dubai: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో పర్యటిస్తున్నారు. దుబాయ్‌లో COP28 వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ శుక్రవారం ప్రారంభమైంది. COP28 క్లైమేట్ సమ్మిట్ ప్రారంభ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. 2028లో COP33ని భారతదేశంలో నిర్వహించాలని ప్రతిపాదించారు. క్లైమేట్ చేంజ్ ప్రక్రియ కోసం ఐక్యరాజస్య సమితి (UN) ఫ్రేమ్‌వర్క్‌కు భారతదేశం కట్టుబడి ఉందని ప్రధాని పునరుద్ఘాటించారు.

COP28 climate summit in Dubai: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) లో పర్యటిస్తున్నారు. దుబాయ్‌లో COP28 వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ శుక్రవారం ప్రారంభమైంది. COP28 క్లైమేట్ సమ్మిట్ ప్రారంభ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. 2028లో COP33ని భారతదేశంలో నిర్వహించాలని ప్రతిపాదించారు. క్లైమేట్ చేంజ్ ప్రక్రియ కోసం ఐక్యరాజస్య సమితి (UN) ఫ్రేమ్‌వర్క్‌కు భారతదేశం కట్టుబడి ఉందని ప్రధాని పునరుద్ఘాటించారు. అందుకే, ఈ వేదిక నుంచి 2028లో భారతదేశంలో COP33 సమ్మిట్‌ను నిర్వహించాలని ప్రతిపాదిస్తున్నట్లు మోదీ తెలిపారు. COP28గా సూచించే ఐక్యరాజ్యసమితి ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (UNFCCC) ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్‌లో నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12 వరకు జరుగుతోంది. యూఏఈ వేదికగా జరుగుతున్న ఈ శిఖరాగ్ర సమావేశంలో రాబోయే రోజుల్లో వాతావరణ మార్పులకు సంబంధించిన సమస్యలను చర్చించే సమ్మిట్ సెరిమోనియల్ ఓపెనింగ్‌లో ప్రధాని నరేంద్ర మోడీకి అవకాశమిచ్చారు. ఈ రోజు, ఈ ఫోరమ్ నుంచి వాతావరణ అనుకూల, క్రియాశీల, సానుకూల చొరవను ప్రకటిస్తున్నాను .. గ్రీన్ పవర్ చొరవ కోసం అంతా కృషిచేయాలని.. వాతావరణ మార్పులకు నాంది పలకలాంటూ ప్రధాని మోదీ ప్రపంచ నాయకులకు పిలుపునిచ్చారు. 2030 వరకు ఉద్గారాల తీవ్రతను 45 శాతానికి తగ్గించడమే భారతదేశ లక్ష్యమని, అలాగే శిలాజాయేతర ఇంధనం వాటాను 50 శాతానికి పెంచాలని నిర్ణయించినట్లు మోదీ వివరించారు. 2070 నాటికి తమ లక్ష్యం సున్నా అని.. ఆ దిశగా ముందుకు వెళ్తామని మోదీ పేర్కొన్నారు.
COP28 వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ శిఖరాగ్ర సమావేశం ప్రారంభం కాగానే నాయకులంతా ఫొటో దిగారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్‌తో సహా వివిధ ప్రపంచ నాయకులతో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు. ఈ కార్యక్రమానికి బ్రిటన్ రాజు చార్లెస్ III కూడా హాజరయ్యారు. దీనికి ముందు, వాతావరణ మార్పుల సదస్సు 28వ ఎడిషన్ వేదికపై ప్రధాని మోదీని యుఎఇ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ స్వాగతం పలికారు.
దాదాపు 21 గంటల పాటు దుబాయ్‌లో పర్యటించనున్న ప్రధాని మోదీ ఏడు ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహిస్తారని, నాలుగు ప్రసంగాలు చేస్తారని, వాతావరణ సంఘటనలపై రెండు ప్రత్యేక కార్యక్రమాలలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ అనేది యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ (UNFCCC)కి సంబంధించిన 28వ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ (COP28) ఉన్నత-స్థాయి విభాగం.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..