Elon Musk on Parag Agrawal: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్.. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా భారత సంతతి టెక్కీ పరాగ్ అగర్వాల్ నియామకమైన సంగతి తెలిసిందే. సీఈవోగా ఉన్న ట్విట్టర్ సహ వ్యవస్థాపకుడు జాక్ డోర్సే సోమవారం పదవీ నుంచి దిగిపోవడంతో ఆయన స్థానంలో చీఫ్ టెక్నికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న పరాగ్ అగర్వాల్‌ను సంస్థ బోర్డు ఏకగ్రీవంగా నియమించింది. 2006 నుంచి డోర్సే ట్విట్టర్ సారథిగా కొనసాగుతూ వస్తున్నారు. అయితే.. ట్విట్టర్ సీఈఓగా భారత వ్యక్తిని నియమించడంపై టెస్లా బిలియనీర్ ఎలోన్ మస్క్ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు. భారతీయ ప్రతిభ నుంచి అమెరికా చాలా ప్రయోజనం పొందింది అంటూ అని టెస్లా బాస్ మస్క్ ట్వీట్ చేశారు.
గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబిఎమ్ వంటి ప్రపంచంలోని అగ్రశ్రేణి టెక్ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న భారతీయ సంతతి వ్యక్తులపై పాట్రిక్ కొల్లిసన్ చేసిన ఓ ట్వీట్‌కు ఆయన సమాధానమిచ్చారు. గూగుల్-పెరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ CEOగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ CEOగా సత్య నాదెళ్ల సేవలందిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. అలాంటి ప్రముఖ US టెక్ సంస్థకు నాయకత్వం వహించనున్న పరాగ్ అగర్వాల్ కూడా అత్యంత ప్రతిభావంతుడని కొనియాడారు. కాగా.. ఎలన్ మస్క్ ట్విట్‌పై చాలామంది స్పందిస్తూ రీట్విట్ చేస్తున్నారు. వారంతా అత్యంత ప్రతిభావంతులని కొనియాడుతున్నారు.
USA benefits greatly from Indian talent!
— Elon Musk (@elonmusk) November 29, 2021
Also Read: