AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సీన్ సితారే.. పాక్‌పై ఆఫ్ఘనిస్తాన్ దాడి మామూలుగా లేదుగా..

పాకిస్తాన్‌లో ఆర్థిక సంక్షోభంతో పాటు టమాటా ధరల సంక్షోభం కూడా వచ్చిపడింది. భారీ వర్షాల వల్ల పంట నష్టం, ఆఫ్ఘనిస్తాన్‌తో సరిహద్దు వివాదం కారణంగా టమాటా ఎగుమతులు నిలిచిపోవడంతో దేశంలో సరఫరా తగ్గింది. దీంతో లాహోర్, కరాచీ వంటి నగరాల్లో టమాటా ధర కిలోకు రికార్డు స్థాయిలో రూ. 700కి పెరిగింది.

సీన్ సితారే.. పాక్‌పై ఆఫ్ఘనిస్తాన్ దాడి మామూలుగా లేదుగా..
ఈ తుపాన్‌ కారణంగా టమాటా పంట భారీగా దెబ్బతింది. దీంతో పంట దిగుబడి బాగా పడిపోయింది. గత ఏడాది ఇదే సమయంలో సగటున దాదాపు 700 మెట్రిక్‌ టన్నుల టమాటా మదనపల్లె మార్కెట్‌కు రాగా, ఈ రోజు మాత్రం కేవలం140 మెట్రిక్‌ టన్నుల టమాట మాత్రమే రావడం గమనార్హం. ఆంధ్రాప్రదేశ్‌తోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో పంట దిగుబడి విపరీతంగా తగ్గింది.
Krishna S
|

Updated on: Oct 22, 2025 | 9:10 PM

Share

ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న పాకిస్తాన్‌ను మరో కొత్త చిక్కు వచ్చి పడింది. ఆఫ్ఘనిస్తాన్‌తో సరిహద్దు వివాదం, భారీ వర్షాల కారణంగా పంట నష్టం జరగడంతో దేశంలో టమాటా ధరలు ఆకాశాన్ని తాకాయి. స్థానిక నివేదికల ప్రకారం.. లాహోర్, కరాచీతో సహా అనేక ప్రధాన నగరాల్లో టమాటా ధరలు రికార్డు స్థాయిలో పెరిగి కిలోకు రూ. 700కు చేరుకున్నాయి. కొన్ని వారాల క్రితం రూ. 100కి అమ్ముడైన టమాటాల ధర ఇంతగా పెరగడంతో సామాన్య పాకిస్తానీల బడ్జెట్‌పై తీవ్ర ప్రభావం పడింది.

ధరల పెరుగుదలకు కారణాలు

టమాటా ధరల పెరుగుదలకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. పాకిస్తాన్‌లోని అనేక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల టమాటా పంటలు పూర్తిగా నాశనం కావడంతో దేశీయ సరఫరా తీవ్రంగా తగ్గింది. సరిహద్దు వివాదం కారణంగా ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం టమాటాలతో సహా అనేక కూరగాయల ఎగుమతిని నిలిపివేసింది.దీంతో పాక్‌కు టమాటాల రాక తగ్గింది. సరఫరాలో కొరత డిమాండ్ పెరగడం వల్ల ఈ ధరల పెరుగుదలకు కారణాలుగా చెప్పొచ్చు. ఆఫ్ఘనిస్తాన్‌తో వాణిజ్య మార్గాలు మూసివేయడం వల్ల ధరలు విపరీతంగా పెరిగాయని క్వెట్టా, పెషావర్ వ్యాపారులు పేర్కొన్నారు.

ప్రధాన నగరాల్లో టమాటా ధరలు

  • జీలం: కిలోకు రూ. 700.
  • గుజ్రాన్‌వాలా: కిలోకు రూ. 575.
  • ఫైసలాబాద్: కిలోకు రూ. 160 నుండి రూ. 500 వరకు
  • ముల్తాన్: కిలోకు రూ. 450.
  • ప్రభుత్వ సగటు ధర: కిలోకు రూ. 170.

ప్రభుత్వంపై ఒత్తిడి

పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రభుత్వం ఇరాన్ నుండి టమాటాలను అత్యవసరంగా ఆర్డర్ చేసినట్లు సమా టీవీ నివేదించింది. అయితే ఇవి ప్రజలకు చేరే వరకు ఉపశమనం లభించదని వ్యాపారులు, పౌరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇరానియన్ టమాటాలు పాకిస్తాన్ చేరేటప్పటికీ ఎంత తాజాగా ఉంటాయనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఈ నేపథ్యంలో సాధారణ పౌరులు, వ్యాపారులు వెంటనే ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వంతో చర్చలు జరపాలని షరీఫ్ ప్రభుత్వాన్ని కోరారు. సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడం ద్వారా మాత్రమే కూరగాయల కొరతను అధిగమించవచ్చని వారు సూచించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..