AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చరిత్ర సృష్టించిన చైనా.. ట్రాక్‌పై దూసుకెళ్లిన వరల్డ్స్‌ ఫాస్టెస్ట్‌ బులెట్‌ ట్రైన్‌! గంటకు ఎన్ని కిలోమీటర్లంటే..?

చైనా కొత్త CR450 బుల్లెట్ రైలు ప్రపంచ రికార్డు సృష్టించింది. గంటకు 453 కి.మీ.ల వేగంతో దూసుకుపోయి, ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా అవతరించింది. ఏరోడైనమిక్ డిజైన్, తక్కువ బరువు, అధునాతన సాంకేతికతతో CR450 వాణిజ్యపరంగా 400 కి.మీ. వేగాన్ని లక్ష్యంగా పెట్టుకుంది.

చరిత్ర సృష్టించిన చైనా.. ట్రాక్‌పై దూసుకెళ్లిన వరల్డ్స్‌ ఫాస్టెస్ట్‌ బులెట్‌ ట్రైన్‌! గంటకు ఎన్ని కిలోమీటర్లంటే..?
Cr450 Bullet Train
SN Pasha
|

Updated on: Oct 22, 2025 | 11:17 PM

Share

చైనా కొత్త బుల్లెట్ రైలు CR450 ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన హై-స్పీడ్ రైలుగా అవతరించింది. ట్రయల్ రన్లలో గరిష్టంగా గంటకు 453 కిలో మీటర్ల వేగంతో దూసుకెళ్లింది. ఈ రైలు ప్రస్తుతం షాంఘై, చెంగ్డు మధ్య హై-స్పీడ్ రైలు మార్గంలో ప్రీ-సర్వీస్ టెస్ట్‌లో ఉంది. CR450 వాణిజ్యపరంగా 400 కిలో మీటర్ల వేగంతో నడపడానికి రూపొందించారు. ఇది ప్రస్తుతం సేవలో ఉన్న CR400 ఫక్సింగ్ రైళ్ల కంటే 50 కిలో మీటర్లు ఎక్కువ వేగంతో వెళ్తుంది. CR400 మోడల్‌లు 350 కిలో మీటర్ల వేగంతో వెళ్తాయి. ఇదే ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగవంతమైన టైన్‌. ఇప్పుడు దాన్ని CR450 బ్రేక్‌ చేసింది.

ఇంత వేగాన్ని అందుకోవడానికి CR450 అనేక కీలక డిజైన్ అప్‌గ్రేడ్‌లతో వస్తుంది, గాలి లాగడాన్ని తగ్గించడానికి పొడవైన నోస్ కోన్ (15 మీటర్లు), 20 సెంటీమీటర్ల తక్కువ పైకప్పు రేఖ, మునుపటి మోడల్‌ కంటే 55 టన్నులు బరువు తక్కువ, ఈ మార్పులు కలిసి ఏరోడైనమిక్ నిరోధకతను 22 శాతం తగ్గించి, వేగం, ఇంధన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తాయి.

CR450 కేవలం 4 నిమిషాల 40 సెకన్లలో 0 నుండి 350 కిలో మీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇది CR400 కంటే 100 సెకన్లు వేగంగా ఉంటుంది, ఇది ఎంత త్వరగా గరిష్ట వేగాన్ని చేరుకోగలదో చూపిస్తుంది. ట్రయల్స్ సమయంలో రెండు CR450 రైళ్లు కలిపి గంటకు 896 కిలో మీటర్ల వేగంతో మార్గాలను దాటాయి. ఇది కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది. ప్రయాణీకులకు సేవలు అందించే ముందు ఇంజనీర్లు ప్రస్తుతం 600,000 కిలోమీటర్ల ట్రైయల్‌ రన్‌ నిర్వహించారు. ఇంజనీర్లు స్పోర్ట్స్ కార్ల నుండి డిజైన్ ప్రేరణ పొంది, రైలు ఏరోడైనమిక్ మెరుగుదలలపై ఐదు సంవత్సరాలుగా పనిచేశారు. అండర్ బాడీ ప్యానెల్లు, బోగీలు కూడా కనీస గాలి నిరోధకత కోసం డిజైన్‌ చేశారు.

ఈ చైనా హై-స్పీడ్ రైలు కొత్త ప్రపంచ ప్రమాణాన్ని నిర్దేశించింది. జపాన్, జర్మనీ, భారత్‌ వంటి దేశాలు తమ సొంత రైలు సాంకేతికతలను మెరుగుపరుచుకుంటున్నప్పటికీ గంటకు 450 కిలో మీటర్ల వేగాన్ని చేరుకోవడం చాలా మందికి సుదూర లక్ష్యంగా మిగిలిపోయింది. భూమిపై అత్యంత వేగవంతమైన, అత్యంత సమర్థవంతమైన రైళ్ల రేసులో CR450 కొత్త అధ్యాయాన్ని లిఖించింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి