పాక్‌లో విజృంభిస్తున్న ప్రాణాంతక వైరస్‌.. భారత్‌కూ పొంచివున్న ముప్పు?

|

Aug 28, 2024 | 1:15 PM

CCHF కేసు వెలుగులోకి వచ్చింది. ఐ బ్లీడింగ్‌ వైరస్‌ సోకిన 14ఏళ్ల బాలుడి కళ్ల నుంచి రక్తం కారుతున్నట్టుగా సమాచారం అందింది. ప్రస్తుతం ఆ బాలునికి వైద్యులు చికిత్స అందిస్తున్నట్టుగా తెలిసింది.. పాకిస్తాన్‌లో వ్యాప్తి చెందుతున్న ఈ వ్యాధి ఇప్పుడు భారతీయుల్ని కూడా భయపెడుతోంది. ఎందుకంటే..

పాక్‌లో విజృంభిస్తున్న ప్రాణాంతక వైరస్‌.. భారత్‌కూ పొంచివున్న ముప్పు?
Eye Bleeding Virus Cchf
Follow us on

చైనా నుంచి వచ్చిన కరోనా వైరస్‌ ప్రపంచాన్నే గడగడలాడించింది. ఇప్పుడు పాకిస్థాన్ నుంచి భయానక వార్తలు వస్తున్నాయి. ప్రపంచంలోని అత్యంత ప్రాణాంతక వ్యాధులలో ఒకటైన క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ (CCHF) కేసు వెలుగులోకి వచ్చింది. ఐ బ్లీడింగ్‌ వైరస్‌ సోకిన 14ఏళ్ల బాలుడి కళ్ల నుంచి రక్తం కారుతున్నట్టుగా సమాచారం అందింది. ప్రస్తుతం ఆ బాలునికి వైద్యులు చికిత్స అందిస్తున్నట్టుగా తెలిసింది.. పాకిస్తాన్‌లో వ్యాప్తి చెందుతున్న ఈ వ్యాధి నుండి ఇప్పుడు భారతీయుల్ని కూడా భయపెడుతోంది. ఎందుకంటే వైరస్ అంటువ్యాధి. ఒకరి నుంచి మరొకరికి సులువుగా వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. WHO ప్రకారం, ఐ బ్లీడింగ్ వైరస్ లేదా క్రిమియన్ కాంగో హెమరేజ్ ఫీవర్ నివారించడం, చికిత్స చేయడం కష్టం అంటున్నారు. ఇది తీవ్రమైన వైరల్ వ్యాధి. ఇది ప్రధానంగా పేలు ద్వారా వ్యాపించే సంక్రమణ ప్రాణాంతకమైనది క్రిమియన్-కాంగో హెమరేజిక్ ఫీవర్ వైరస్ (CCHFV) వల్ల వస్తుంది.

కంటి రక్తస్రావం వైరస్ అనేది 1944లో క్రిమియన్ ద్వీపకల్పంలో పుట్టింది. 1956లో కాంగో బేసిన్‌లో వ్యాధికి సంబంధించిన ఇతర కేసులు కనిపించాయి. క్రిమియన్ కాంగో హెమరేజ్ ఫీవర్ ఉన్నవారిలో 80శాతం మంది ఎటువంటి లక్షణాలను అనుభవించరు. CCHF వైరస్ తల్లి నుండి పిండానికి, ఆసుపత్రులలో, తల్లి నుండి పిండానికి, అనారోగ్యంతో ఉన్న వ్యక్తితో దగ్గర ఉన్నవారికి, అలాగే పేలు కాటు ద్వారా వ్యాపిస్తుంది.

CCHF వైరస్ వైరస్ సంక్రమణ, లక్షణాలు

ఇవి కూడా చదవండి

CCHF వైరస్ సోకినప్పుడు ఒక వ్యక్తి తేలికపాటి నుండి తీవ్రమైన లక్షణాలను అనుభవిస్తారు.. వైరస్ సోకిన జంతువులలో 12 రోజుల పాటు సజీవంగా ఉంటుంది. కానీ అవి ఎలాంటి లక్షణాలను చూపించవు. ఒక వ్యక్తి సోకినట్లయితే, ఈ క్రింది లక్షణాలు కనిపించవచ్చు.

CCHF వైరస్‌ కారణంగా సడెన్‌ వచ్చే జ్వరం, తీవ్రమైన కండరాల నొప్పి, ఉన్నట్టుండి కళ్లు తిరగడం, మెడ నొప్పి, వెన్నునొప్పి, తలనొప్పి, కళ్ళు నొప్పి, ఫోటోఫోబియా వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి ముదిరే కొద్దీ, తీవ్రమైన రక్తస్రావం, అవయవ వైఫల్యం, కాంతి సున్నతిత్వం, వాంతులు వంటివి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మరణానికి కారణమవుతుంది.

CCHF అనే ప్రాణాంతక వ్యాధికి ఇంకా చికిత్స లేదా వ్యాక్సిన్ గానీ అందుబాటులో లేదు. జబ్బుపడిన వ్యక్తులను వేరుచేసి వ్యాధి లక్షణాలను తగ్గిస్తారు. CCHF ఉన్నవారిలో 50శాతం మంది మరణిస్తున్నట్టుగా ఆరోగ్య శాఖ వెల్లడించింది. వ్యాధులకు దూరంగా ఉండాలంటే వ్యాధి నివారణ ఒక్కటే మార్గం. వ్యాధి సోకిన వ్యక్తికి దూరంగా ఉండటం, సోకిన దేశం లేదా ప్రదేశానికి వెళ్లకుండా ఉండటం ద్వారా వ్యాధిని నివారించవచ్చు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..