Pakisthan PM Imran Khan: పాకిస్థాన్‌లో అవినీతిని అంతం చేస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌కి రోజు రోజుకీ కష్టాలు పెరుగుతున్నాయి. అధికార పార్టీ తెహ్రిక్ ఈ ఇన్సాఫ్ కు విదేశాల నుంచి వచ్చిన విరాళాలు.. సొంతం ఖర్చులకు వాడుకోవడమే కాకుండా దాచిపెట్టారంటూ ఇమ్రాన్ ఖాన్ పై ఆరోపణలు వచ్చాయి. దీంతో విపక్షాలు ఇమ్రాన్‌పై తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. పీటీఐకి ఎన్నికల సమయంలో విదేశాలస్ నుంచి వచ్చిన కోట్లాది రూపాయలు… పాకిస్థాన్ ఎన్నికల సంఘం విదేశీ నిధుల కేసుతో తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ విరాళ గురించి లెక్కలను ఇప్పటి వరకూ అధికార పార్టీ ప్రకటించలేదు.
ఈ మేరకు ఎన్నికల కమిషన్ దర్యాప్తు బృందం నివేదికను విడుదల చేసింది. దీంతో కీలక సమాచారం తెరపైకి వచ్చింది. నిధుల సమస్యకు సంబంధించి పీటీఐ ఎన్నికల కమిషన్‌కు తప్పుడు సమాచారం ఇచ్చిందని ఈ నివేదిక ద్వారా తెలిసింది. నివేదిక ప్రకారం… అధికార పార్టీకి రూ. 1.64 బిలియన్లు అందాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ ప్రకటించినట్లు తెలుస్తోంది. ఈ విరాళాల్లో 31 కోట్లు మాత్రమే బ్యాంక్ ఖాతాలో ఉన్నట్లు నివేదిక ద్వారా తెలుస్తోంది. దీంతో పాకిస్తాన్ ముస్లిం లీగ్-ఎన్ , పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, పాకిస్తాన్ డెమోక్రటిక్ మూవ్‌మెంట్ వంటి వివిధ ప్రతిపక్ష పార్టీలు రంగంలోకి దిగి.. ప్రభుత్వం తీరుని ఖండించాయి. నిధుల దుర్వినియోగం పై ప్రధాని మంత్రి ఇమ్రాన్ ఖాన్ పై విచారణ చేపట్టాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.
ఇమ్రాన్ ఖాన్ విరాళాల డబ్బులను దొంగతనం చేసి దాచుకోవడమే కాదు.. కాకుండా ప్రజల సొమ్మును కూడా కొల్లగొట్టాడని పీఎంఎల్-ఎన్ వైస్ ప్రెసిడెంట్ మర్యమ్ నవాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇమ్రాన్ ఖాన్, PTI ల దొంగతనం బహిర్గతమయింది కనుక అవినీతిపై దర్యాప్తు చేసి.. దేశం ముందు పీటీఐ అసలు రంగును మరింతగా బట్టబయలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.
2014లో కేసు నమోదు:
2014లో పార్టీ వ్యవస్థాపక సభ్యుడు అక్బర్ బాబర్ విదేశీ విరాళాల కేసులో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పార్టీ పీటీఐపై కేసు వేశారు. విరాళాల విషయంలో అక్రమాలు జరిగాయని బాబర్ ఆరోపించారు. ఇమ్రాన్ ఖాన్ పై అక్రమంగా డబ్బు సంపాదించడం, పాకిస్తాన్, విదేశాలలో బ్యాంకు ఖాతాల్లో డబ్బులు దాచడం, మనీలాండరింగ్, అక్రమంగా విదేశీయుల నుంచి డబ్బును స్వీకరించడానికి ప్రైవేట్ బ్యాంక్ ఖాతాలను ఉపయోగించడం వంటి అభియోగాలు ఉన్నాయి.
Also Read: సినిమా టికెట్ ధరలను సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చిన ఏపీ సర్కార్‌కు థాంక్స్ చెప్పిన సీనియర్ నటుడు..