China – Pak Relations: చైనాపై ఆధారపడ్డ పాకిస్తాన్ విదేశాంగ విధానం.. అంగీకరించిన ఇమ్రాన్ ఖాన్

|

Feb 07, 2022 | 9:31 AM

అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్తాన్ చైనాతో స్నేహం ఎవరికీ దాపరికం కాదు. ఇప్పుడు పాకిస్తాన్ తన విదేశాంగ విధానాన్ని చైనాకు అనుగుణంగా రూపొందించడం ప్రారంభించింది.

China - Pak Relations: చైనాపై ఆధారపడ్డ పాకిస్తాన్ విదేశాంగ విధానం.. అంగీకరించిన ఇమ్రాన్ ఖాన్
China Pak Relations
Follow us on

China Pak Relations: అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్తాన్(Pakistan) – చైనా(China)తో స్నేహం ఎవరికీ దాపరికం కాదు. ఇప్పుడు పాకిస్తాన్ తన విదేశాంగ విధానాన్ని(Foreign Policy) చైనాకు అనుగుణంగా రూపొందించడం ప్రారంభించింది. పాకిస్తాన్ విదేశాంగ విధానం చైనాపై ఆధారపడి ఉందని ప్రధాని ఇమ్రాన్ ఖాన్(Imran Khan) మరోసారి స్పష్టం చేశారు. చైనాతో పాకిస్తాన్ సంబంధాలు ఇస్లామాబాద్ విదేశాంగ విధానానికి మూలస్తంభంమని ఇమ్రాన్ ప్రకటించారు. పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ తమ దేశ విదేశాంగ విధానం పూర్తిగా బీజింగ్‌పై ఆధారపడి ఉందని అంగీకరించారు. ఎందుకంటే ఇరు దేశాలు పరస్పరం ప్రధాన ప్రయోజనాలకు సంబంధించిన సమస్యలపై తమ మద్దతును పునరుద్ఘాటించారు.

ఆదివారం బీజింగ్‌లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌తో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భేటీ అయ్యారు. ఇరుదేశాల నేతలు ద్వైపాక్షిక సంబంధాలతోపాటు ప్రాంతీయ పరిస్థితులు, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులపై తమ అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నారు. ఇరువురు నేతల భేటీ అనంతరం ఒక సంయుక్త ప్రకటన చేశారు. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ (CPEC) పాకిస్తాన్ ఆర్థిక, సామాజిక అభివృద్ధిలో ముఖ్యమైన పాత్ర పోషించిందని, బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ (BRI) కోసం జీ జిన్‌పింగ్‌ను ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసించారు.

పాకిస్తాన్, చైనాల మధ్య లోతైన స్నేహం!

పాకిస్తాన్ చైనా దేశాల మధ్య సన్నిహిత వ్యూహాత్మక సంబంధాలు, వారితో స్నేహం ఆవశ్యకమని పాకిస్తాన్ చైనా నాయకులు కూడా పునరుద్ఘాటించారు. ద్వైపాక్షిక సంబంధాలు ఇరు దేశాల ప్రయోజనాలను పరిరక్షిస్తాయని ఆకాక్షించారు. తన విదేశాంగ విధానానికి పాకిస్తాన్, చైనాల మధ్య సంబంధాలే మూలస్తంభమని ఇమ్రాన్ ఖాన్ అంగీకరించారు. చైనాతో సన్నిహిత స్నేహం పాకిస్తాన్ ప్రజల శాశ్వత మద్దతును పొందుతుందన్నారు. దక్షిణ చైనా సముద్రానికి సంబంధించిన సమస్యలపై పాకిస్తాన్ చైనాకు తన మద్దతును కూడా అందించింది. పశ్చిమ దేశాలు దాని విస్తరణ విధానాన్ని ప్రోత్సహించడానికి బీజింగ్ రూపొందించిన ఏకపక్ష నియమాలు, నిబంధనలకు పాకిస్తాన్ ఆమోదం తెలిపింది. తైవాన్, దక్షిణ చైనా సముద్రం, హాంగ్‌కాంగ్, టిబెట్‌లలో చైనా విధానానికి కట్టుబడి, వారికి మద్దతును పాక్ పక్షం వ్యక్తం చేసింది. ఈమేరకు ఇరు దేశాలాధినేతలు సంయుక్త ప్రకటన చేసిననట్లు స్థానిక మీడియా పేర్కొంది.

Read Also… WILD ANIMALS : వన్యప్రాణుల మనుగడకు పెను ప్రమాదం.. జనావాసాల్లోకి చిరుతలు, పులులు