Pakistan PM Imran Khan: పదవి ఉంటుందా.. ఊడిపోతుందా? ఇమ్రాన్ ఖాన్ భవితవ్యం తేలేది ఆ రోజే..

|

Mar 21, 2022 | 11:50 AM

విపక్షాల నిరసనకు తోడు సొంత పార్టీనేతలే అసమ్మతి రాగం వినిపిస్తుండడంతో పాక్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ (PM Imran Khan) ప్రస్తుతం అగమ్యగోచర పరిస్థితుల్లో ఉన్నారు

Pakistan PM Imran Khan: పదవి ఉంటుందా.. ఊడిపోతుందా? ఇమ్రాన్ ఖాన్ భవితవ్యం తేలేది ఆ రోజే..
Imran Khan
Follow us on

విపక్షాల నిరసనకు తోడు సొంత పార్టీనేతలే అసమ్మతి రాగం వినిపిస్తుండడంతో పాక్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్‌ (PM Imran Khan) ప్రస్తుతం అగమ్యగోచర పరిస్థితుల్లో ఉన్నారు.  ప్రధానిగా ఈ మాజీ క్రికెటర్‌ కొనసాగుతారా? లేదా? అనే విషయం మరికొన్ని రోజుల్లో   రోజుల్లో తేలిపోనుంది. పాకిస్తాన్‌ పార్లమెంట్లోని దిగువ సభ అయిన నేషనల్‌ అసెంబ్లీ (Natioanl Assembly) సమావేశాలు శుక్రవారం (మార్చి25) నుంచి ప్రారంభమవుతాయని స్పీకర్‌ అసద్‌ ఖైసర్‌ ప్రకటించారు. ప్రతిపక్ష సభ్యులు ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానం (No trust motion) ఈ సమావేశాల్లోనే చర్చకు రానుంది. దీంతో తిరుగుబావుటా ఎగరవేసిన సొంత పార్టీ నేతలను మళ్లీ తన దారికి తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఈ మాజీ క్రికెటర్‌ తలమనకలయ్యారు. కాగా దేశంలో ఆర్థిక సంక్షోభానికి, ద్రవ్యోల్బణం పెరుగుదలకు ఇమ్రాన్‌ఖాన్‌ పాటిస్తున్న విధానాలే కారణమంటూ పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ (పీఎంఎల్‌-ఎన్‌), పాకిస్తాన్‌ పీపుల్స్‌ పార్టీ (పీపీపీ)కి చెందిన సుమారు 100 మంది సభ్యులు ఈనెల8న ఇమ్రాన్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే.

ఓఐసీ సదస్సు తో..

పాక్‌ పార్లమెంట్ నిబంధనల ప్రకారం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన 14 రోజులకే ఓటింగ్‌ నిర్వహించాలి. ఆలెక్కన మార్చి 21నే జాతీయ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభించాలని విపక్షాలు పట్టుబట్టాయి. అయితే రేపటి (మార్చి 22) నుంచి పార్లమెంట్‌ హౌస్‌లో ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోపరేషన్‌ (ఓఐసీ) సదస్సు జరగనుంది. రెండ్రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి 50 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరు కానున్నారు. జాతీయ భద్రతకు సంబంధించిన సదస్సు కావడంతో దీనికి ఆటంకం కలగకూడదని స్పీకర్‌ రషీద్‌ సెషన్‌ సమావేశాలను వాయిదా వేశారు. మొదట్లో వ్యతిరేకించినా విపక్షాలు కూడా స్పీకర్‌ నిర్ణయానికి అంగీకారం తెలిపాయి. ఈ నేపథ్యంలో మార్చి 25న ఉదయం 11 గంటలకు 41వ నేషనల్‌ అసెంబ్లీ సెషన్‌ ప్రారంభమవుతుందని స్పీకర్‌ అసద్‌ ఖైసర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ప్రధానిపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆరోజే చర్చ జరగనుంది.

సామాజిక బహిష్కరణ తప్పదు..

కాగా 342 మంది ఉన్న నేషనల్‌ అసెంబ్లీలో ఇమ్రాన్‌ను ప్రధాని పదవి నుంచి తొలగించాలంటే విపక్షాలకు 172 మంది సభ్యుల మద్దతు కావాలి. అధికార తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌ (పీటీఐ)కి ప్రస్తుతం 155 మంది సభ్యులు ఉన్నారు. వీరు కాకుండా చిన్న చిన్న పార్టీలకు చెందిన మరో 23 మంది ఇమ్రాన్‌ ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారు. అయితే సొంత పార్టీకి చెందిన 24 మంది సభ్యులు తిరుగుబావుటా వేయడం ఇమ్రాన్‌కు తలనొప్పిగా మారింది. కాగా స్పీకర్‌ నోటిఫికేషన్‌తో ఇమ్రాన్‌ఖాన్‌ అప్రమత్తమయ్యారు. రెబల్స్‌ను తన దారికి తీసుకొచ్చుకునే ప్రయత్నాలను ప్రారంభించారు. అదే సమయంలో తన మాట వినని వారిపై సామాజిక బహిష్కరణ లాంటి కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరికలు పంపారు.

Also Read:Khalid Payenda: ఒకప్పుడు రాజకీయాల్లో చక్రం తిప్పాడు.. ఇప్పుడు కుటుంబ పోషణకు స్టీరింగ్ పట్టాడు.. తలకిందులైన మాజీ మంత్రి జీవనం

RRR in Delhi: తారక్, చెర్రీలతో కలిసి నాటు నాటు సాంగ్‌కు స్టెప్స్ వేసిన అమీర్ ఖాన్.. నెట్టింట్లో వీడియో వైరల్

IT Alert: మార్చి 31 వచ్చేస్తోంది.. ఈ విషయాలు పూర్తి చేశారా.. వెంటనే కంప్లీట్ చేయండి..