University studys: రెండు వేర్వేరు టీకాలు తీసుకుంటే.. మరింత సూపర్..! తేల్చిన ‘ఆక్స్​ ఫర్డ్’​ అధ్యయనం

|

Jun 29, 2021 | 1:10 PM

ఓ రిపోర్టును విడుదల చేశారు. అందులో వివరాలు ఇలా ఉన్నాయి... రెండు డోసులకుగానూ రెండు వేర్వేరు వ్యాక్సిన్లు వేసినా పెద్దగా ఎలాంటి సమస్యలు రాలేదని తేల్చి చెప్పారు.

University studys: రెండు వేర్వేరు టీకాలు తీసుకుంటే.. మరింత సూపర్..! తేల్చిన ఆక్స్​ ఫర్డ్​ అధ్యయనం
Covid Vaccine
Follow us on

ఫస్ట్ డోస్ ఏ వ్యాక్సిన్ తీసుకుంటే.. సెకండ్ డోస్ కూడా అదే తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశాలు. కొవాగ్జిన్, కొవిషీల్డ్ ఈ వ్యాక్సిన్ విషయంలోనూ అదే సూచన చేసింది కేంద్ర ప్రభుత్వం. మొదట ఏ వ్యాక్సిన్ తీసుకుంటే.. సెకండ్ డోస్ కూడా అదే వ్యాక్సిన్ తీసుకోవాలి… ఈ నియమం మన దేశంలోనే కాదు.. ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాలూ ఇదే నిబంధనను కొనసాగుతోంది. ఇదిలావుంటే.. ఇటీవల కొన్ని దేశాలలో మొదటి డోస్ ఒక వ్యాక్సిన్ ఇచ్చి.. రెండో డోస్ వేరే వ్యాక్సిన్ ఇవ్వడం జరిగింది. మరి, అదెంత వరకు కరెక్ట్..? దాని వల్ల కలిగే లాభనష్టాలేంటి పరిశోధకులు ఫోకస్ పెట్టారు? దీనిపైనే ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు స్టడీ చేస్తున్నారు.

అయితే ఆక్స్‌ఫర్డ్ వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రథమికంగా ఓ రిపోర్టును విడుదల చేశారు. అందులో వివరాలు ఇలా ఉన్నాయి… రెండు డోసులకుగానూ రెండు వేర్వేరు వ్యాక్సిన్లు వేసినా పెద్దగా ఎలాంటి సమస్యలు రాలేదని తేల్చి చెప్పారు.

ఒక డోస్ ఆస్ట్రాజెనెకా, మరో డోస్ ఫైజర్ టీకాలు తీసుకున్న వ్యక్తుల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించినట్లుగా వెల్లడించారు. ఇలా టీకాలు తీసుకున్న 10 శాతం మందిలో తీవ్రమైన అలసట ఉన్నట్టు గుర్తించారు. దీంతో పాటు తలనొప్పి, జ్వరం వంటి సహజమైన లక్షణాలూ చాలా మందిలో కనిపించాయని పేర్కొన్నారు.

అయితే ఇలా తీసుకున్నవారిలో అలాంటి లక్షణాలు ఎక్కువ రోజులు లేవని.. ఒకటి, రెండు రోజుల తర్వాత అంతా అలాంటి లక్షణాలు కనిపించలేదని అన్నారు. అయితే, ఒకే రకం వ్యాక్సిన్ తీసుకున్న వారితో పోలిస్తే అలసట తీవ్రత కొంచెం ఎక్కువగా కనిపించిందని తమ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఒకే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలో అలసట కేవలం 3 శాతం మందిలోనే ఉందన్నారు. వారు పరిశోధనల్లో తీసుకున్న వారి వయసు కూడా 50 సంవత్సరాల పైబడినవారేనని తెలిపారు. కానీ యువతలో మాత్రం అలసట కొద్దిగా ఎక్కువ ఉండే అవకాశం ఉందని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ తన రిపోర్ట్‌లో వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:  Darbhanga Blast: దర్బంగా పేలుళ్ల వెనుక హైదరాబాదీలు.. ఆ ఇద్దరిని అరెస్ట్ చేసి NIA

Viral Video: చిన్నారిని నవ్వించేందుకు కుక్క కుప్పిగంతలు.. ఈ వీడియో చూస్తే.. అస్సలు నవ్వాపుకోలేరు..