హంజా అమెరికానే బెదిరించాడు.. అధ్యక్షుడు ట్రంప్

| Edited By: Pardhasaradhi Peri

Aug 03, 2019 | 12:10 PM

అల్‌ఖైదా ఉగ్రవాద సంస్ద వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ కొడుకు హంజా లాడెన్ మృతిపై అమెరికా అధ్యక్షుడు స్పందించారు. హంజా చాల ప్రమాదకరవ్యక్తి అని.. ఏకంగా అగ్రరాజ్యం అమెరికానే టార్గెట్ చేసి సర్వనాశనం చేస్తానంటూ బెదరించాడన్నారు ట్రంప్. ఇదిలా ఉంటే లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ హ‌త‌మైన‌ట్లు అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు. అయితే ఎక్క‌డ‌, ఎప్పుడు చ‌నిపోయాడ‌న్న దానిపై మాత్రం అధికారులు క్లారిటీ ఇవ్వ‌లేదు. హంజా లాడెన్ ఆచూకీ చెబితే ప‌దిల‌క్ష‌ల డాల‌ర్లు ఇస్తామ‌ని […]

హంజా అమెరికానే బెదిరించాడు..  అధ్యక్షుడు ట్రంప్
Follow us on

అల్‌ఖైదా ఉగ్రవాద సంస్ద వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ కొడుకు హంజా లాడెన్ మృతిపై అమెరికా అధ్యక్షుడు స్పందించారు. హంజా చాల ప్రమాదకరవ్యక్తి అని.. ఏకంగా అగ్రరాజ్యం అమెరికానే టార్గెట్ చేసి సర్వనాశనం చేస్తానంటూ బెదరించాడన్నారు ట్రంప్. ఇదిలా ఉంటే లాడెన్ కుమారుడు హంజా బిన్ లాడెన్ హ‌త‌మైన‌ట్లు అమెరికా ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు. అయితే ఎక్క‌డ‌, ఎప్పుడు చ‌నిపోయాడ‌న్న దానిపై మాత్రం అధికారులు క్లారిటీ ఇవ్వ‌లేదు.

హంజా లాడెన్ ఆచూకీ చెబితే ప‌దిల‌క్ష‌ల డాల‌ర్లు ఇస్తామ‌ని ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో అమెరికా ప్ర‌భుత్వం ఓ ప్ర‌కటన చేసింది. హంజాకు 30 ఏళ్ల వ‌య‌సు ఉంటుంద‌ని అనుమానాలు ఉన్నాయి. అయితే అమెరికాతో పాటు ఇత‌ర దేశాల‌పైన దాడులు చేయాలంటూ ఆడియోలు, వీడియోలను హంజా రిలీజ్ చేశాడ‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. హంజా హ‌త‌మైన‌ట్లు ఎన్‌బీసీ, న్యూయార్క్ టైమ్స్ వార్తా సంస్థ‌లు వెల్ల‌డించాయి.