కొవిడ్ వచ్చి ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన చేసిన విషయం అందిరికీ తెలిసిందే. అయితే ఇప్పటివరకు ఆ వైరస్ ఎలా పుట్టింది అనే దానిపై స్పష్టత రాలేదు. ప్రపంచవ్యాప్తంగా కరోనా పుట్టుకపై చర్చలు, పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్నోరకాల థీయరీలు వచ్చాయి. కొంతమంది ఆ వైరస్ చైనా ల్యాబ్ లోనే పుట్టిందని, మరికొందరు గబ్బిలాల నుంచి వచ్చిందని అంటూ వివిధ రకాలుగా తమ నివేదికలను బయటపెట్టారు. అయితే ఇప్పుడు తాజాగా కరోనా పుట్టుకపై మరో థీయరీ వెలుగులోకి వచ్చింది. వైరస్ మూలాలు కనుగోనేందుకు పరిశోధనలు చేస్తున్న అంతర్జాతీయ వైరస్ నిపుణుల బృందం ఓ కొత్త విషయాన్ని బయటపెట్టింది. కరోనా వైరస్ రక్కూన్ డాగ్స్ అనే జంతువుల నుంచి ఈ వైరస్ వ్యాపించినట్లు భావిస్తున్నారు. అట్లాంటిక్ అనే సంస్థ తన నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది
2020 జనవరిలో చైనాలోని వూహన్ మార్కెట్ లో మొదటిసారిగా కరోనా వైరస్ బయటపడినప్పుడు అక్కడి అధికారులు ఆ మార్కెట్ ను మూసేశారు. ఆ ప్రాంతం నుంచి జంతువులన్నింటినీ పంపించివేశారు. ఆ తర్వాత అక్కడికి వచ్చిన కొంతమంది పరిశోధకులు ఆ ప్రాంతంలోని గోడలు , ఎడ్లబండ్లు, మెటల్ కేజీల నుంచి కొన్ని సాంపుల్స్ సేకరించారు. ఆ తర్వాత వాటిని పరీక్షించగా ఆ సాంపుల్స్ కి కరోనా వైరస్ పాజిటీవ్ గా తేలింది. ఈ పరిశోధన జరిపిన ముగ్గురు శాస్త్రవేత్తలు ఆ వైరస్ జన్యు పదార్థాన్ని కొన్ని జంతువులకు చెందినట్లుగా గుర్తించారు. అయితే ఇందులో ఎక్కవ మొత్తంలోని జన్యు పదార్థం రక్కూన్ డాగ్ కు చెందినట్లుగా తేల్చారు.
అయితే రక్కూన్ డాగ్ కి ఆ జన్యూ పదార్థం ఎలా లింక్ అయిందన్న విషయం తెలియడం లేదు. ఒకవేళ ఈ వైరస్ ఇతర జంతువుల నుంచి మానవులకు వ్యాపించిందా లేక వైరస్ వచ్చిన వ్యక్తి వల్ల రక్కూన్ డాగ్ కి వ్యాపించిందా అనే దానిపై స్పష్టత లేదు. ఆ జంతు మార్కెట్ నుంచి తీసుకున్న జెనెటిక్ సాంపుల్స్ ని గ్లోబల్ డెటాబెస్ లో చేర్చినప్పటికీ శాస్త్రవేత్తలు దాని గురించి చైనాను ప్రశ్నించారు. కానీ ఆ తర్వాత మళ్లీ వాటిని డెటాబేస్ నుంచి తొలగించినట్లు అట్లాంటిక్ తన నివేదికలో తెలిపింది.ఇదిలా ఉంటే ఇంతకుముందు ఎఫ్ బీఐ డైరెక్టర్ క్రిస్టోఫర్ రే అనే వ్యక్తి.. కరోనా వైరస్ చైనా ప్రభుత్వానికి చెందిన ల్యాబ్ లో నుంచే బయటపడినట్లు తమ బ్యూరో విశ్వసిస్తోందని చెప్పడంతో ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..