Kim Jong Un: అజ్ఞాతం వీడిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్.. 35 రోజుల తర్వాత అక్కడ ప్రత్యక్షం

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న ఊహాగానాల్లో వాస్తవం లేదని తేలిపోయింది. కిమ్ జోంగ్ ఉన్ నెల రోజుల తర్వాత అజ్ఞాతం వీడాడు.

Kim Jong Un: అజ్ఞాతం వీడిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్.. 35 రోజుల తర్వాత అక్కడ ప్రత్యక్షం
Kim Jong Un

Updated on: Nov 16, 2021 | 10:53 AM

North Korea News: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా వినిపిస్తున్న ఊహాగానాల్లో వాస్తవం లేదని తేలిపోయింది. కిమ్ జోంగ్ ఉన్ నెల రోజుల తర్వాత అజ్ఞాతం వీడాడు. గత 35 రోజులుగా ఆయన ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియాలో ఎక్కడా కనిపించలేదు. దీంతో ఆయన ఆరోగ్యం క్షీణించిందంటూ అంతర్జాతీయ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. 2014 తర్వాత ఆయన ఇన్ని రోజులు అజ్ఞాతంలో ఉండటం ఇదే తొలిసారి. ఆయన ప్రభుత్వ మీడియాలో కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యం, ఆచూకీపై పలురకాల ఊహాగానాలు వినిపించాయి. ఈ నేపథ్యంలో కిమ్.. చైనా సరిహద్దులో నిర్మిస్తున్న కొత్త నగరం వద్ద మంగళవారం ప్రత్యక్షమయ్యారు. దీంతో ఆయన పూర్తి ఆరోగ్యవంతంగా, సురక్షితంగా ఉన్నట్లు తేలిపోయింది.

చైనా సరిహద్దులో నిర్మిస్తున్న కొత్త నగరంలో ఎకనామిక్ హబ్‌తో పాటు కొత్త అపార్టుమెంట్లు, హోటళ్లు, స్కై రిసార్టులు, వాణిజ్య, సాంస్కృతిక, వైద్య భవనాలను నిర్మించనున్నారు. 2018 నుంచి కిమ్ ఇక్కడ పలుసార్లు పర్యటించి.. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను నేరుగా పర్యవేక్షించారు. మూడో దశ(చివరి దశ) పనులను సందర్శించేందుకు కిమ్ అక్కడ పర్యటించినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరినాటికల్లా అక్కడ నిర్మాణ పనులు ముగియనున్నాయి.

గతంలోనూ కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియా ప్రభుత్వ మీడియాలో కనిపించకుండా పోయినప్పుడు ఆయన ఆరోగ్యంపై పలు రకాల పుకార్లు వినిపించాయి.

Also Read..

China: సముద్రం నుంచి అంతరిక్షంలోకి రాకెట్లు ప్రయోగించే వేదిక సిద్ధం చేస్తున్న చైనా..

Beer In Shoes: ఆస్ట్రేలియా ప్లేయర్స్‌ బూట్లలో బీరు పోసుకొని ఎందుకు తాగారో తెలుసా.? దీని వెనక పెద్ద కథే ఉందండోయ్‌..