ఆధునిక హిట్లర్ గా ఖ్యాతిగాంచిన ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మళ్ళీ సంచలన నిర్ణయంతో వార్తల్లో నిలిచాడు. ఇటీవల కిమ్ తన ముద్దుల తనయ ‘జు-యే’ ను ప్రపంచం ముందుకు తీసుకొస్తున్నాడు. తొమ్మిదేళ్ల జు యే గత కొన్ని రోజుల క్రితం ప్రపంచానికి రెండో సారి కనిపించి ఆసక్తిని రేకెత్తించింది. ఇటీవల ‘జు-యే’ తన తండ్రి కిమ్ తో కలిసి బాహ్య ప్రపంచానికి కనిపిస్తుండడంతో.. ఆమె కిమ్ వారసురాలనే పుకార్లు షికారు చేస్తున్నాయి. అయితే తమ దేశంలో జు-యే పేరు ఉన్నవారంతా పేర్లు మార్చుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే కిమ్, ఆయన భార్య సోల్-జు పేర్లు ప్రజలు పెట్టుకోవడంపై నిషేధం ఉన్న సంగతి తెలిసిందే.
కొరియన్ పీపుల్స్ ఆర్మీ 75వ వార్షికోత్సవ వేడుకల్లో కిమ్ తన భార్య, కుమార్తెతో కలిసి పాల్గొన్నాడు. మిలటరీ విందుకు కిమ్ భార్య రీ సోల్ జూ, ఆయన కుమార్తె జూ యే కూడా హాజరయ్యారు. చాలా విలాసవంతంగా జరిగిన బాంక్వెట్‌కు .. కిమ్ తన ఫ్యామిలీతో విందులో పాల్గొన్నారు. ఇక్కడప్రధాన ఆకర్షణగా కిమ్ కూతురు పేరు జూ యే నిలిచింది. ఆమె వయసు తొమ్మిదేళ్లు. బంగారు బటన్లు, లెదర్ గ్లోవ్స్ , నల్ల టోపీ, కోటు ధరించిన జూ యే పైనే అందరి దృష్టి. ఈ వేడుకల్లో బాంక్వెట్‌లో టేబుల్ సెంటర్ సీటులో కిమ్ తన కూతుర్ని కూర్చోబెట్టారు. దీంతో ఆమె దేశానికి భవిష్యత్ నాయకురాలు అనే ఊహాగానాలకు ఊపిరి పోసినట్లు అయింది. మిలిటరీ ఈవెంట్‌కు కూతుర్ని తీసుకువచ్చి.. రాచరిక పాలన సంకేతాన్నీ కిమ్ ఇచ్చాడని నిపుణులు భావిస్తున్నారు.
వాస్తవానికి కిమ్ తన వ్యక్తిగత విషయాలను చాలా గోప్యంగా ఉంచుతారు. కుటుంబంతో కలిసి బయట కనిపించడం అరుదు. ఇప్పుడు వేడుకల్లో పాల్గొన్న కిమ్ కుమార్తె జూ యే… ఇలా ప్రపంచం ముందు కనిపించడం ఇది రెండోసారి మాత్రమే. కొంతకాలం కిందట జరిగిన ఓ మిసైల్ పరీక్షకు కుమార్తెతో కలిసి కిమ్ హాజరు అయ్యారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..