New Zealand PM Jacinda Ardern: ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. నిత్యం లక్షలాది కేసులు, వేలాది మరణాలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పుట్టుకొస్తున్న కరోనా వేరియంట్లు అలజడి రేపుతున్నాయి. దీంతో పలు దేశాలు అప్రమత్తమై కఠిన ఆంక్షలను అమలు చేస్తున్నాయి. వీకెండ్ లాక్‌డౌన్లు, నైట్ కర్ఫ్యూలను విధించాయి. అంతేకాకుండా అన్ని చోట్ల నిబంధనలు పాటించేలా ఏర్పాట్లు చేశాయి. శుభకార్యాలకు హాజరయ్యే వారి సంఖ్యను కూడా పరిమితం చేస్తూ మార్గర్శకాలను విడుదల చేశాయి. ఈ క్రమంలో న్యూజిలాండ్‌లో కరోనా, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. దీంతో న్యూజిలాండ్ ప్రభుత్వం సైతం కఠిన ఆంక్షలు విధించింది. అయితే.. ఈ ఆంక్షలు ఆదేశ ప్రధానమంత్రి జసిండా ఆర్డెర్న్ పెళ్లి అడ్డొచ్చాయి. ఈ ఆంక్షల నేపథ్యంలో తన పెళ్లిని రద్దు చేసుకుంటున్నట్లు ప్రధాని జెసిండా ప్రకటించారు. క్లార్క్ గేఫోర్డ్, జెసిండా ఇద్దరు స్నేహితులు. చాలా కాలంగా కలిసిఉంటున్న జెసిండా.. గేఫోర్డ్ కరోనా కారణంగా పలుమార్లు తమ పెళ్లిని వాయిదా వేసుకున్నారు. అయితే తాజాగా కరోనా ఆంక్షల నేపథ్యంలో పెళ్లిని వాయిదా వేసుకున్నామని తెలిపారు. అయితే.. వివాహ తేదీని ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.
ఈ మేరకు జెసిండా ఆదివారం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తుందని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మహమ్మారి వల్ల ఇబ్బందులను అనుభవించిన వారిలో తాను కూడా చేరానని ప్రధాని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒమిక్రాన్, డెల్టా వేరియంట్ కంటే చాలా వేగంగా వ్యాపిస్తోందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అయితే.. భయపడాల్సిన పనిలేదని.. ఈ వైరస్ వల్ల తీవ్ర అనారోగ్యానికి గురయ్యే అవకాశం తక్కువగా ఉన్నట్లు తెలిపారు. ఈ నెలఖరు వరకు నిబంధనలు అమల్లో ఉంటాయని.. అందరూ మాస్క్ ధరించాలని, వ్యాక్సిన్ తీసుకోవాలని కోరారు.
Also Read: