మెటల్ ఛైన్ ధరించి MRI రూమ్‌లోకి వెళ్లిన వ్యక్తి.. ఆ తర్వాత ఏం జరిగిందంటే.. ఈ విషయం తెలిస్తే వణుకే!
అమెరికాలోని న్యూయార్‌లో విషాదకర ఘటన వెలుగు చూసింది. MRI మిషన్‌లోకి లాగబడి 61 ఏళ్ల వయస్సున్న ఓ వ్యక్తి మరణించాడు. లాంగ్ ఐలాండ్‌కు చెందిన 61 ఏళ్ల కెయిత్ మెక్‌అలిస్టర్ అనే వ్యక్తి తన భార్య MRI స్కాన్ చేయించుకునే క్రమంలో సడెన్‌గా స్కానింగ్‌రూమ్‌లోకి వచ్చాడు. అతను మెడలో మెటల్ చైన్ ఉండడంతో అతని మిషన్‌లోకి లాగబడ్డాడు. తీవ్ర గాయాలతో ఒక రోజు తర్వాత మరణించాడు.

అమెరికాలోని న్యూయార్‌లో విషాదకర ఘటన వెలుగు చూసింది. తన భార్య MRI స్కాన్ చేయించుకునే క్రమంలో స్కానింగ్‌రూమ్‌లోకి వచ్చిన వ్యక్తి మెషిన్‌లోకి లాగబడి మరణించారు. ఘటనపై కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కొన్ని అంతర్జాతీయ నివేదికల ప్రకారం.. లాంగ్ ఐలాండ్‌కు చెందిన 61 ఏళ్ల కెయిత్ మెక్‌అలిస్టర్ అనే వ్యక్తి తన భార్య అడ్రియన్ జోన్స్‌తో పాటు ఒక హాస్పిటల్‌కు వెళ్లారు. అక్కడ తన భార్య మొకాలుకు స్కాన్ చేయాలని వైద్యులను కోరారు. దీంతో వాళ్లు MRI చేయాలని సూచించారు. దీంతో వైద్యులు ఆమెకు MRI స్కాన్ తీసేందుకు సిద్ధమై ఆమెను రూమ్‌లోకి తీసుకెళ్లారు. స్కాన్ జరుగుతున్నప్పుడు ఆమె భర్త మెక్అలిస్టర్ సడెన్‌గా MRI గదిలోకి ప్రవేశించాడు. అయితే అతని మెడలో బరువైన ఒక మెటల్ ఛైన్ ఉడడంతో అంత్యంత మాగ్నెటిక్ పవర్ కలిసిన ఆ MRI మిషన్‌లోకి అతను లాగబడ్డాడు.
అది గమనించిన MRI టెక్నీషియన్, అతని భార్య మెక్‌అలిస్టర్‌ను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించినా ఎలాంటి ఫలితం లేకపోయింది. మిషన్ ఆఫ్ చేసిన తర్వాత అతన్ని దానిలోంచి బటయకు తీసి హాస్పిటల్‌కు తరలించారు. కాగా తీవ్రగాయాలైన 61 ఏళ్ల మెక్అలిస్టర్ గురువారం (జూలై 17)హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారు. ఇక ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాపును ప్రారంభించారు. MRI స్కాన్ జరుగుతుండగా ఆ వ్యక్తి గదిలోకి ఎందుకు ప్రవేశించాడో తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
MRI యంత్రాలు ఎలా పని చేస్తాయి? అవి ప్రమాదకరమా?
MRI అంటే మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్. ఇది శరీరంలోని అంతర్గత భాగాలను తక్కువ ప్రమాదంతో, క్లియర్‌గా స్కాన్ చేసి చిత్రాలుగా చూపించే అత్యాధునిక వైద్య పరికరం ఇది చాలా బలమైన అయస్కాంతాలు రేడియో తరంగాలు, కంప్యూటర్ సాంకేతికత సహాయంతో పనిచేస్తుంది. MRI యంత్రం ద్వారా శరీరంలోని కండరాలు, మజ్జలు, మెదడు, జాయింట్లు వంటి మృదుల కణజాలాలను స్పష్టంగా చూడవచ్చు. ఇది ఎక్స్‌రే లేదా CT స్కాన్‌కి భిన్నంగా ఉంటుంది. దీని వల్ల ప్రయోజనం ఎంత సరైన జాగ్రత్తులు తీసుకోకపోతే ప్రమాదం కూడా అదే రీతో ఉంటుంది. ముఖ్యంగా మనం లోహపు వస్తువులను ధరించి MRI రూమ్‌లోకి వెళ్లకూడదు. ఎందుకంటే అందులో ఉండే బలమైన అయస్కాంత క్షేత్రం, లోహ వస్తువులను తనవైపు ఆకర్షిస్తుంది. ఈ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
