New worries for China : చైనా దేశం దిగులు చెందుతోంది. తమ స్థానాన్ని ఇండియా భర్తీ చేయడం జీర్ణించుకోలేకపోతుంది. భారత్ 2025 నాటికి చైనా జనాభాను దాటుతుంది. ప్రస్తుతం చైనా జనాభా 141.2 కోట్లు. భారత్‌లో ఇప్పటికే సుమారు 138 కోట్ల జనాభా ఉంది. చైనాలో జననాల సంఖ్య తగ్గుతుంటే భారత్‌లో మాత్రం పెరుగుతుంది. అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా ఇన్ని రోజులు తన ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది. అయితే ఆ ఘనతను భారత్‌కు ఇచ్చేయాల్సి వస్తుందేమోనని ఆందోళన చెందుతుంది. నాలుగేళ్లుగా చైనాలో జననాల రేటు తగ్గింది మరణాల రేటు పెరిగింది. ఒకప్పుడు చైనాలో మరణాల రేటు కంటే జననాల రేటు రెండు మూడింతలు ఎక్కువగా ఉండేది. సీన్ పూర్తిగా రివర్స్ అయింది. చైనా పొరుగు దేశాలైన దక్షిణ కొరియా, జపాన్‌లో కూడా ఇదే ట్రెండ్ నడుస్తోంది.
యునిసెఫ్ లెక్కల ప్రకారం.. ప్రతీరోజు భారత్ లో 67,385 జననాలు నమోదవుతున్నాయి. ఇది ఏడాదిలో 2,17,52,959 గా ఉంది. 2020లో చైనాలో 1.2 కోట్ల మంది పిల్లలు పుట్టారు. 2019లో ఈ సంఖ్య 1.465 కోట్లుగా ఉంది. 2019 నుంచి 2020కి వచ్చే సరికి జననాల సంఖ్య 18శాతం తగ్గిపోయింది. గర్భధారణ రేటు 1.3 శాతానికి పడిపోయింది. జననాల రేటు కనీసం 2.1 ఉండాలని నిపుణులు చెబుతున్నారు. 1953 నుంచి చూస్తే గత నాలుగేళ్లలో చైనాలో జననాల రేటు బాగా తగ్గిపోయింది. 2010 లో చైనా జనాభా 134 కోట్లు 2021లో ఈ జనాభా 141కోట్లకు చేరింది. అంటే గడిచిన ఏడాదిలో దేశ జనాభా కేవలం 5.34 మాత్రమే పెరిగింది.
చైనాలో పనిచేసే వ్యక్తులు 15 నుంచి 59 మధ్య ఉన్న వారు 89.43కోట్లు మొత్తం జనాభాలో ఇది 63.5శాతం. 60 ఏళ్లు పైబడిన వారి శాతం గతంతో పోల్చుకుంటే 5.44శాతం పెరిగింది. వీరి శాతం దేశ జనాభాలో 26.4కోట్లు లేదా 18.7 శాతం ఉంది. 14 అంతకన్నా తక్కువ వయసున్న వారి సంఖ్య 25.38 కోట్లు దేశ జనాభాలో వీరి శాతం 17.95శాతంగా ఉంది. ఒక్క పిల్లాడు ముద్దు ఇద్దరు పిల్లలు వద్దు’ అని చేసిన చట్టానికి చైనా సడలింపులు ఇచ్చింది. 1970 నుంచి‘ఒకే బిడ్డ’ నిబంధన అమలులో ఉండేది. 40 కోట్ల మంది పుట్టకుండా ఆపినట్లు అధికారులు తెలిపారు. దేశంలో కరువు, నీటి కొరత సమస్యలు తలెత్తకుండా నిలువరించామన్నారు. అవయితే మూడు నాలుగేళ్లలో అత్యధిక జనాభా ఉన్న దేశం అనే ట్యాగ్‌లైన్‌ను భారత్‌కు సమర్పించుకోవడం ఖాయమనే వాదన వినిపిస్తోంది.
2027 నాటికి చైనా దేశ జనాభాను పెంచే ఆలోచన చేస్తోంది. వార్షిక మరణాలు జననాల మధ్య తేడా వచ్చే ఐదేళ్లలో 10లక్షలకు తగ్గించడానికి ప్రయత్నం చేస్తోంది. 2030 తర్వాత నుంచి చైనా జనాభా తగ్గిపోతుందని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. దేశంలో జననాలు కోటికి తగ్గి, మరణాలు కోటిపైగా ఉంటే చైనా జనాభా తగ్గుదల మొదలైనట్లే. అమెరికాలో జననాల రేటు రికార్డు స్థాయిలో 1.6శాతానికి చేరవైంది. ఒకరి కన్నా ఎక్కువ మంది పిల్లలు కనడం కోసం చైనా జంటలకు ప్రత్యేకంగా ఇన్సెంటివ్ ఇస్తామని ప్రకటించింది.