New Coronavirus: కుక్కల్లో కొత్త రకం కరోనా వైరస్.. మనుషులకూ వ్యాపిస్తోందట..!!

|

May 22, 2021 | 8:58 AM

New Type Of Coronavirus: యావత్ ప్రపంచం కరోనా వైరస్‌తో గిలగిల్లాడిపోతోంది. ఒకటి తర్వాత ఒకటి అనేక రకాలుగా...

New Coronavirus: కుక్కల్లో కొత్త రకం కరోనా వైరస్.. మనుషులకూ వ్యాపిస్తోందట..!!
Follow us on

New Type Of Coronavirus: యావత్ ప్రపంచం కరోనా వైరస్‌తో గిలగిల్లాడిపోతోంది. ఒకటి తర్వాత ఒకటి పలు రకాలుగా రూపాంతరం చెందుతూ ఈ మహమ్మారి దేశాలన్నీంటిని అల్లాడిస్తోంది. ఇదిలా ఉంటే కోవిడ్ నుంచి ఇప్పుడిప్పుడే కొన్ని దేశాలు కోలుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కరోనా గురించి బయటపడుతున్న షాకింగ్ విషయాలు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనాల్లో కుక్కల్లో ఓ కొత్త రకం కరోనా వైరస్ వెలుగులోకి వచ్చింది.

అమెరికాకు చెందిన డాక్టర్‌ గ్రేగరీ గ్రే, అతడి శిష్యుడు లేషన్‌ క్ష్యూ ఇటీవల జరిపిన పరిశోధనలలో ఈ కొత్త వైరస్‌ను కనుగొన్నారు. ఈ వైరస్ కుక్కల నుంచి మనుషులకు సోకినట్లు గుర్తించారు. వీరు చేసిన అధ్యయనంపై క్లినికల్‌ ఇన్‌ఫెక్షస్‌ డిసీజెస్‌ జర్నల్‌లో ఓ కథనం కూడా ప్రచురితమైంది. 2017-2018 సంవత్సరాల మధ్య కాలంలో మలేషియాలోని సెరవాక్ ఆసుపత్రిలో న్యుమోనియాతో చేరిన 301 మంది రోగుల శాంపిల్స్ సేకరించి.. వాటిని పరీక్షించగా కుక్కలలో ఉద్భవించిన కొత్త రకం కరోనా వైరస్‌ కంటపడింది.

ఈ వైరస్ ప్రభావం పిల్లలపై ఎక్కువగా ఉంటుందని అన్నారు. 300 శాంపిల్స్‌ను టెస్ట్ చేయగా.. కేవలం ఎనిమిది మంది పిల్లల్లో ఈ కొత్త వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు. ఈ కొత్త కరోనా వైరస్ జంతువుల నుంచి మనుషులకు వ్యాపిస్తున్నట్లు సూచనలు కనిపించాయని డాక్టర్‌ గ్రేగరీ గ్రే చెప్పారు. అయితే ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుందా.? లేదా.? ఈ వైరస్ వల్ల మనుషులకు ఎంత వరకు ప్రమాదం పొంచి ఉందన్న విషయాలు ఇంకా తేలలేదని.. మరింత లోతుగా పరిశోధనలు చేయాల్సి ఉంటుందని డాక్టర్‌ గ్రేగరీ గ్రే స్పష్టం చేశారు. కాగా, ఇప్పటివరకు మనుషుల్లో వ్యాధికి కారణమయ్యే ఏడు రకాల కరోనా వైరస్‌లు ఉన్నాయన్న ఆయన.. నాలుగు జలుబుకు కారణమవుతాయన్నారు. మిగతా మూడు SARS, MERS, COVID-19 వ్యాధులకు కారణమవుతాయని వెల్లడించారు.

Also Read:

ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. షాకింగ్ దృశ్యాలు..

గగుర్పొడిచే దృశ్యం.. పామును సజీవంగా మింగేస్తోన్న మరో పాము.. వీడియో వైరల్.!

SBI కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ.147 డెబిట్ అవుతున్నాయా.? క్లారిటీ ఇచ్చిన బ్యాంక్.!