AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New China Virus: కరోనా లాంటి మరో వైరస్‌ చైనాలో గుర్తింపు! గబ్బిలాల నుంచి మనుషులకు సోకే ప్రమాదం..

చైనాలో కొత్త కరోనా వైరస్‌, HKU5-CoV-2 గుర్తించబడింది. గబ్బిలాలలో కనుగొనబడిన ఈ వైరస్ జంతువుల నుండి మానవులకు వ్యాపించే అవకాశం ఉంది. శాస్త్రవేత్తలు దీనిని కోవిడ్-19 కి సారూప్యంగా పేర్కొన్నారు, అయితే అంత తీవ్రమైనది కాదని చెప్పారు. ఈ పరిశోధన హాంకాంగ్‌లోని శాస్త్రవేత్తల బృందం చేపట్టింది, దీని ఫలితాలు పీర్‌ రివ్యూడ్‌ జర్నల్‌లో ప్రచురించబడ్డాయి. ఈ కొత్త వైరస్‌ మానవ ఆరోగ్యానికి ముప్పును సూచిస్తుంది.

New China Virus: కరోనా లాంటి మరో వైరస్‌ చైనాలో గుర్తింపు! గబ్బిలాల నుంచి మనుషులకు సోకే ప్రమాదం..
Hku5 Cov 2 Virus
SN Pasha
|

Updated on: Feb 22, 2025 | 7:05 AM

Share

కరోనా వైరస్‌ మానవాళిని ఎంతలా అతలాకుతలం చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అనేక మంది ఈ మహమ్మారి బారిన పడి మృతి చెందితే.. కొన్ని కోట్ల మంది జీవనోపాది కోల్పోయి రోడ్డున పడ్డారు. అలాంటి ఓ విపత్తు మళ్లీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. చైనాలో కరోనా వైరస్‌ను పోలిన మరో వైరస్‌ను శాస్త్రేవేత్తలు కనిపెట్టారు. దీని పేరు HKU5-CoV-2. ఇది జంతువుల నుంచి మానవులకు సంక్రమించే ప్రమాదం ఉన్నట్లు భావిస్తున్నారు. గబ్బిలాల్లో గుర్తించిన ఈ వైరస్‌ కరోనా అంత ప్రమాదకరమైందని అంటున్నారు శాస్త్రవేత్తలు. కోవిడ్‌-19కి కారణమైన SARS-CoV2ని పోలీ ఉన్నట్లు గుర్తించారు. ఈ వైరస్‌కు సంబంధించిన విషయాలను హాంకాంగ్‌కు చెందిన సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ అనే పత్రిక తెలిపింది. గబ్బిలాల్లో కరోనా వైరస్‌పై విస్తృత పరిశోధనలు చేసి బ్యాట్‌ ఉమెన్‌గా పేరు తెచ్చుకున్న ప్రముఖ వైరాలజిస్ట్‌ షీ ఝెంగ్‌లీ ఈ పరిశోధనా బృందానికి నాయకత్వం వహించారు.

ఈ పరిశోధనలో గ్వాంగ్‌జౌ లాబొరేటరీ, గ్వాంగ్‌జౌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌, వుహాన్‌ యూనివర్సిటీ, వుహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ సైంటిస్టులు పాల్గొన్నారు. వారి పరిశోధనలు మంగళవారం పీర్‌ రివ్యూడ్‌ జర్నల్‌ సెల్‌లో ప్రచురించారు. కొత్తగా కనిపెట్టిన ఈ వైరస్‌ మిడిల్‌ ఈస్ట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌(MERS) వైరస్‌ను కలిగి ఉండే మెర్బెకోవైరస్‌ ఉపజాతికి చెందింది. ఇది హాంకాంగ్‌లోని జపనీస్‌ పిపిస్ట్రెల్‌ గబ్బిలాల్లో మొదటిగా గుర్తించిన హెచ్‌కేయూ5 కరోనో వైరస్‌ కొత్త రూపం. ఇది నేరుగా లేదా జంతువుల నుంచి మనుషులకు వ్యాపించే అవకాశం ఉందని సైంటిస్టులు అంటున్నాు. అయితే కరోనా అంత తీవ్రమైన ప్రభావం చూపలేదని పేర్కొన్నారు. ఏది ఏమైనా కొత్త కొత్త వైరస్‌లు పుట్టుకొస్తూ మనుషులు జీవితాలను అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఈ తాజా అధ్యయనాలతో మరో కొత్త వైరస్‌ భయం ప్రజలను పట్టుకుంటుంది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.