Uterine Cancer: ఆ క్రీమ్‌లతో గర్భాశయ క్యాన్సర్..? తాజా అధ్యయనంలో విస్తుపోయే వివరాలు..

|

Jun 10, 2023 | 9:39 PM

Uterine Cancer: ప్రస్తుత కాలంలో చాలా మంది అందరి ముందు ఆకర్షిణీయంగా కనిపించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హెయిర్ స్టైల్స్ ప్రధానంగా మారింది. ముఖ్యంగా హెయిర్ స్ట్రెయిటెనింగ్ తప్పనిసరి అయిపోయింది. అయితే హెయిర్..

Uterine Cancer: ఆ క్రీమ్‌లతో గర్భాశయ క్యాన్సర్..? తాజా అధ్యయనంలో విస్తుపోయే వివరాలు..
Uterine Cancer
Follow us on

Uterine Cancer: ప్రస్తుత కాలంలో చాలా మంది అందరి ముందు ఆకర్షిణీయంగా కనిపించేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే హెయిర్ స్టైల్స్ ప్రధానంగా మారింది. ముఖ్యంగా హెయిర్ స్ట్రెయిటెనింగ్ తప్పనిసరి అయిపోయింది. అయితే హెయిర్ స్ట్రెయిటనింగ్ ప్రొడక్ట్స్ వినియోగించే స్త్రీలకు గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని హెచ్చరించింది తాజా అధ్యయనం. 33వేల మంది స్త్రీల హెయిర్ కేర్ రోటిన్స్‌పై అధ్యయనం జరిపిన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్(NIH) ఈ నిర్ణయానికి వచ్చింది. ఏడాదికి 4 సార్లు హెయిర్ స్ట్రెయిటనింగ్ ప్రొడక్ట్స్ ఉపయోస్తున్నవారికి.. ఇతరులతో పోలిస్తే రెండు రెట్లు యుటెరైన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని తెలిపింది.

ఇంకా హెయిర్ కేర్ ప్రొడక్ట్స్‌లోని పారాబెన్స్, థాలేట్స్, ఫ్రాగ్రెన్స్ లాంటి కెమికల్స్ హార్మోన్స్‌ను రెగ్యులేట్ చేసే ఎండోక్రైన్ సిస్టమ్‌కు అంతరాయం కలిగిస్తాయని ఎన్ఐహెచ్ పేర్కొంది. ఇది స్త్రీ పునరుత్పత్తి వ్యవస్థకు అత్యంత సాధారణ క్యాన్సర్ అయిన గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని తెలిపింది. కాగా స్ట్రెటనర్స్ ఉపయోగించిన వారిలో 60శాతం మంది నల్లజాతివారే ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో ఫ్యాషన్ కోసం తమ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా అందంగా కనిపించాలని కోరుకునే నల్లని రంగు కలిగినవారే లక్ష్యంగా పలు కంపెనీలు.. హెయిర్ కేర్ ప్రోడక్ట్స్‌లో ఆరోగ్యానికి హానికరమైన రసాయానాలు ఉపయోగిస్తున్నారని, కానీ ప్రొడక్ట్ లేబుల్‌లో మాత్రం లిస్ట్ చేయడం లేదని ఎన్ఐహెచ్ రీసెర్చ్ పేర్కొంది. ః

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..