AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dance Video: చిన్నదే కానీ చిచ్చర పిడుగు..! డ్యాన్స్‌తో ఆకట్టుకుంటున్న చిన్నారి.. వైరల్ అవుతున్న వీడియో..

Dance Video: సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలో ట్రెండ్ అవుతుంటాయి. అలాంటి వీడియోలలో డ్యాన్స్, మ్యూజిక్ వీడియోలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటాయి. ఇక వాటికి నెటిజన్లు ఆకర్షితులు అవుతుంటారు. అయితే అన్ని డ్యాన్స్ వీడియోలు అలా నెటిజన్లను..

Dance Video: చిన్నదే కానీ చిచ్చర పిడుగు..! డ్యాన్స్‌తో ఆకట్టుకుంటున్న చిన్నారి.. వైరల్ అవుతున్న వీడియో..
Little Girl's Dance
శివలీల గోపి తుల్వా
|

Updated on: Jun 10, 2023 | 6:50 PM

Share

Dance Video: సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలో ట్రెండ్ అవుతుంటాయి. అలాంటి వీడియోలలో డ్యాన్స్, మ్యూజిక్ వీడియోలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉంటాయి. ఇక వాటికి నెటిజన్లు ఆకర్షితులు అవుతుంటారు. అయితే అన్ని డ్యాన్స్ వీడియోలు అలా నెటిజన్లను ఆకర్షించలేవు. కానీ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతోన్న ఓ చిన్నారి డ్యాన్స్ వీడియోను చూస్తే మీరు కళ్లు తిప్పుకోలేకపోవడమే కాదు.. మరోసారి చూడకుండా ఉండలేరు. అవును, ఆ వీడియోలోని చిన్నారి వేసిన స్టెప్పులు అంతగా నచ్చేస్తాయి.

అసలు ఆ వీడియోలో ఏముందంటే.. పిల్లలందరి మధ్య నిలుచొని ఉన్న ఓ చిన్నారి డ్యాన్స్ వేసింది. నిజానికి తాను వేసినవి కొత్త స్టెప్పులేమి కాదు, కానీ అంత చిన్న వయసులో అంతకుమించిన కాన్ఫిడెన్స్‌తో అలా తన హిప్‌ని కడిలిస్తూ డ్యాన్స్ చేయడం అందరినీ ఆకర్షిస్తోంది. ఈ వీడియో ఎక్కడ షూట్ చేశారు, ఆ చిన్నారి ఎవరనే విషయాలు తెలియకపోయినప్పటికీ తనను నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ముఖ్యంగా తన కాన్ఫిడెన్స్‌, చిరునవ్వును ప్రస్తావిస్తున్నారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోను మీరు ఇక్కడే చూడవచ్చు..

ఇవి కూడా చదవండి

వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు కొందరు ఆ చిన్నారిలోని టాలెంట్ అద్భుతమని ప్రశంసిస్తున్నారు. తాను అచ్చం షిన్‌చాన్ కార్టూన్‌లోని టైటిల్ క్యారెక్టర్‌లా ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇలా తమకు తోచిన విధంగా వీడియోపై స్పందిస్తున్నారు. మరోవైపు ఈ వీడియోకు ఇప్పటివరకు 3 లక్షల 16 వేల లైకులు, 26 లక్షల వీక్షణలు లభించాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం..