Nepal Plane Missing: నేపాల్‌లో 22 మందితో వెళ్తోన్న తార ఎయిర్‌లైన్స్ విమానం అదృశ్యం అయింది. ఈ ఫ్లైట్‌కు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో (ఏటీసీ) సంబంధాలు తెగిపోయాయని అధికారులు ప్రకటించారు. దీంతో విమానం ఎక్కడ ఉందో తెలియడం లేదు. ఈ విమానంలో 22 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. వారిలో నలుగురు భారయతీయులు ఉన్నారు. చివరిసారి ఈ విమానం ఉదయం 9:55 గంటలకు ఏటీసీతో టచ్‌లో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ముస్తాంగ్ జిల్లాలోని జోమ్‌సోమ్ ఆకాశంలో విమానం కనిపించిందని స్థానికులు పేర్కొంటున్నారు. ఆ తర్వాత మౌంట్ ధౌలగిరికి వైపు వెళ్లిందని.. ఆ తర్వాత దానితో సంబంధాలు తెగిపోయినట్లు చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ నేత్ర ప్రసాద్ శర్మ మీడియాకు తెలిపారు. కాగా.. విమానం అదృశ్యం కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దాని ఆచూకీ కనుగునేందుకు అధికారులను అప్రమత్తం చేశారు.
10:35 తర్వాత ATSతో సంబంధాలు కట్..
10.30 తర్వాత విమానం – ఏటీసీతో ఎలాంటి సంబంధాలు లేవని అధికారులు తెలిపారు. విమానం 10:35 వరకు ATCని సంప్రదించింది. ప్రస్తుతం విమానం గురించి తెలుసుకోవడానికి హెలికాప్టర్‌ను పంపించారు. విమానాన్ని చివరిగా సంప్రదించిన ప్రాంతాలకు హెలికాప్టర్‌ను పంపినట్లు జోమ్‌సోమ్ ఎయిర్‌పోర్ట్ ATC తెలియజేసింది.
తారా ఎయిర్ ప్రకారం, విమానంలో సిబ్బందితో సహా మొత్తం 22 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 13 మంది నేపాలీ, నలుగురు భారతీయులు, ఇద్దరు జపాన్ పౌరులు. సిబ్బందిలో విమానం పైలట్, కెప్టెన్ ప్రభాకర్ ప్రసాద్ ఘిమిరే, కో-పైలట్ ఇటాసా పోఖారెల్, ఎయిర్ హోస్టెస్ ఖాస్మీ థాపా ఉన్నారు. విమానం అదృశ్యమైనట్లు తారా ఎయిర్ ప్రతినిధి సుదర్శన్ బర్తౌలా ధృవీకరించారు. సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని తెలిపారు.