NASA: శరీరంలో కోవిడ్ 19ని ముందే పసిగిట్టే పరికరం.. కీలక ప్రయోగానికి శ్రీకారం చుట్టిన ‘నాసా’
NASA-Fitbit: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగలాడించినవ విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తితో ప్రపంచ మొత్తం స్థంభించిపోయింది.
NASA-Fitbit: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగలాడించినవ విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తితో ప్రపంచ మొత్తం స్థంభించిపోయింది. అత్యసరమైన సేవలు మినహా.. అన్ని సేవలు నిలిచిపోయాయి. ప్రజలు ఇళ్ల నుంచి కాలు బయట పెట్టేందుకు కూడా గడగడ వణికిపోయిన పరిస్థితులను మనం చూశాం. ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. కరోనా మహమ్మారి ప్రభావం మాత్రం తగ్గడం లేదు. ముఖ్యంగా యూరఫ్ దేశాలు, అమెరికా దేశాలపై దీని ప్రభావం అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో అమెరికాకు చెందిన నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్(నాసా) కీలక నిర్ణయం తీసుకుంది. తమ సంస్థ ఉద్యోగుల ఆరోగ్యాన్ని పరిరక్షించేందుకు సరికొత్త పరికరాన్ని ప్రయోగాత్మకంగా ప్రారంభించింది.
అంతరిక్షంలో ప్రయాణించే ఆస్ట్రోనాట్స్ ఆరోగ్యం మెరుగ్గా ఉండాలి. అప్పుడే వారిని అంతరిక్ష ప్రయాణానికి అనుమతించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ‘ఫిట్‌బిట్’ పరికరంతో తమ సంస్థ ఉద్యోగుల ఆరోగ్యాన్ని పరక్షించేందుకు నాసా శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా 150 మంది వ్యోమగాములతో సహా 1,000 మంది ఉద్యోగులకు ‘ఫిట్‌బిట్’ పరికరాలను అందిస్తామని నాసా తెలిపింది. స్పేష్ మిషన్స్ పాల్గొనే వ్యోమగాములను ఆరోగ్యంగా ఉంచడం కోసం ఈ ‘ఫిట్‌బిట్’ను ప్రయోగాత్మకంగా పరిశీలించాలని నిర్ణయించినట్లు నాసా వెల్లడిచింది. ఈ ఫిట్‌బిట్ పరికరాన్ని ఉద్యోగులు ధరించడం ద్వారా వారి ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయవచ్చునని సంస్థ ప్రతినిధులు తెలిపారు. వ్యాధుల లక్షణాలు, శరీర ఉష్ణోగ్రత, ఇతర ఆరోగ్య సంబంధిత అంశాలను కూడా ఇది గమనిస్తుందన్నారు. తద్వారా వారి ఆరోగ్యాన్ని పరిరక్షించబడుతుందని చెప్పారు. ముఖ్యంగా కోవిడ్ 19 లక్షణాలను ముందుగానే పసిగడుతుందని చెప్పుకొచ్చారు. కోవిడ్ 19 లక్షణాలను ముందే పసిగిట్టినట్లయితే.. సదరు ఉద్యోగిని ఆఫీసుకు రాకుండా అడ్డుకోవచ్చునని, దాంతో ఇతర ఉద్యోగులు కరోనా బారిన పడుకుండా ఉండేందుకు ఉపకరిస్తుందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కాగా, ఆస్ట్రోనాట్స్ రక్షణ కోసం ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్న నాసా.. తాజాగా మరిన్ని చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో రూపొంచిందిన ఈ ఫిట్‌బిట్ పరికరాన్ని గూగుల్ నుంచి స్వీకరించారు. ఈ ఫిట్‌బిట్ ధరించిన వారి ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు ఇది ట్రాక్ చేస్తుంటుంది. హృదయ స్పందనను, హృదయ స్పందనలోని తేడాలను, కోవిడ్ 19 లక్షణాలను, ఇతర వ్యాధుల లక్షణాలను ఇట్టే పసిగడుతుంది. అంతేకాదు.. దీనిని ధరించిన వ్యక్తి ఆరోగ్య లక్షణాలను ఇది రికార్డ్ చేస్తుంది. ఆ రిపోర్ట్ అధారంగా నాసా తన ఉద్యోగులకు ఎప్పటికప్పుడు ఆరోగ్యానికి సంబంధించిన సూచనలు, సలహాలు అందించే అవకాశం ఉంది. మరి ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తుందనేది నిర్ధారించడం కోసం నాసా దీనిని పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టింది.
Also read:
Uppena: ‘ఉప్పెన’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఆ సీన్‌ను చూడటం కష్టమే.. సేతుపతి యాక్టింగ్ అదుర్స్.!