AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Uppena: ‘ఉప్పెన’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఆ సీన్‌ను చూడటం కష్టమే.. సేతుపతి యాక్టింగ్ అదుర్స్.!

Uppena Movie Review: మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన చిత్రం ‘ఉప్పెన’. కృతి శెట్టి హీరోయిన్‌గా..

Uppena: 'ఉప్పెన' మూవీ ట్విట్టర్ రివ్యూ.. ఆ సీన్‌ను చూడటం కష్టమే.. సేతుపతి యాక్టింగ్ అదుర్స్.!
Uppena Movie Review
Ravi Kiran
| Edited By: Team Veegam|

Updated on: Feb 13, 2021 | 10:53 AM

Share

Uppena Movie Review: మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్రలో దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కించిన చిత్రం ‘ఉప్పెన’. కృతి శెట్టి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇక భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందు వచ్చిన ‘ఉప్పెన’.. కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయంగా కనిపిస్తోంది.

తొలి ఆటతోనే హిట్ టాక్ తెచ్చిన ‘ఉప్పెన’పై నెటిజన్లు ట్విట్టర్ వేదికగా తమ స్పందనలను తెలియజేస్తున్నారు. లీడ్ పెయిర్ వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి యాక్టింగ్ బాగుందని అంటున్నారు. హీరోయిన్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, లుక్స్ యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటాయట. ఇక ‘రాయనం’ పాత్రలో తమిళ నటుడు విజయ్ సేతుపతి తన నటనా విశ్వరూపాన్ని చూపించాడట. చాలామంది ప్రేక్షకులు ఆయన్ని చూడటం కోసం సినిమాకు వెళతారని అనడంలో అతిశయోక్తి లేదు. ఇక రూమర్‌గా ట్విట్టర్‌లో వైరల్ అయిన ఓ సీన్ సినిమాలో ఉందని తెలుస్తోంది. అయితే ఆ సీన్‌ను చూడటం కష్టమేనని ప్రేక్షకులు అంటున్నారు. నటీనటులు అందరూ కూడా ఎమోషన్స్ అద్భుతంగా పండించారని చెబుతున్నారు.

అటు సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ మరోసారి తనదైన శైలి బాణీలతో అలరించారని చెబుతున్నారు. ముఖ్యంగా ఫస్టాఫ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయని సమాచారం. క్లైమాక్స్‌లో అయితే మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. ఓవరాల్‌గా సినిమా బాగుందంటూ అభిమానులు ట్విట్టర్‌లో తమ రెస్పాన్స్‌ను తెలుపుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి:

12 ఏళ్ల బుడతడు.. స్టాక్ మార్కెట్‌లో ఏకంగా రూ. 16 లక్షలు ఇన్వెస్ట్ చేశాడు.. ఆ తర్వాత ఏమైందంటే.!

తనకున్న వ్యాధిపై క్లారిటీ ఇచ్చి ఎమోషనల్ అయిన కాజల్.. షాక్‌లో ఫ్యాన్స్.!