RadheShyam Movie Update: ప్రభాస్ అభిమానులకు గుడ్‌న్యూస్.. సూపర్బ్ ఫోటోతో టీజర్ అప్డేట్ ఇచ్చిన ‘రాధేశ్యామ్’..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ వచ్చేసింది. రెబల్ స్టార్ నటిస్తోన్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ టీజర్ విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ వచ్చేసింది. రెబల్ స్టార్ నటిస్తోన్న తాజా చిత్రం ‘రాధేశ్యామ్’ టీజర్ విడుదల తేదీని ప్రకటించింది చిత్రయూనిట్. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్వకత్వంలో ఈ అందమైన ప్రేమకావ్యం తెరకెక్కుతుంది. ఈ సినిమా కొత్త పోస్టర్ షేర్ చేస్తూ ఫిబ్రవరి 14వ తేదీన ఉదయం 9.18 గంటలకు రాధేశ్యామ్ టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. ప్రేమికుల రోజు అభిమానులకు పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ప్రభాస్.
ఇటీవలే ఈ మూవీ షూటింగ్ పూర్తైంది. ఏప్రిల్‌లో రాధేశ్యామ్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ప్రభాస్ 20వ సినిమాగా రాబోతున్న ఈ మూవీపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రి టీజర్ కూడా దుమ్మురేపుతోంది. 1960 దశకం నాటి వింటేజ్ లవ్ స్టోరీతో జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ మూవీని రూపొందిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ఫోటోలో ప్రభాస్ చేతులు జేబులో పెట్టుకోని తనదైన స్టైల్లో వాక్ చేస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు. ఈ పోస్టర్ ఓ పెయింటింగ్‌ని తలపించేలా డిజైన్ చేశారు. తొందర్లోనే ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించే ఛాన్స్ ఉంది. ‘రాధే శ్యామ్’ హిందీ వెర్షన్ కు సంబంధించి మిథున్ – మనన్ భరద్వాజ్ సంగీతం అందిస్తుండగా.. తెలుగుతోపాటు మిగిలిన దక్షిణాది భాషలకు మ్యూజిక్ సమకూర్చే బాధ్యతను జస్టిన్ ప్రభాకరన్‌కు అప్పగించారు.
Directed by @director_radhaa Presented by @UVKrishnamRaju garu Produced by @UV_Creations @TSeries #BhushanKumar with #Vamshi #Pramod & @PraseedhaU under @AAFilmsIndia @GopiKrishnaMvs pic.twitter.com/22V0eNMtnc
— UV Creations (@UV_Creations) February 12, 2021
Also Read:
సెట్స్‌పైకి వెళ్లనున్న చెస్ దిగ్గజం బయోపిక్.. ప్రధాన పాత్ర పోషించనున్న బాలీవుడ్ స్టార్ హీరో.!