సెట్స్‌పైకి వెళ్లనున్న చెస్ దిగ్గజం బయోపిక్.. ప్రధాన పాత్ర పోషించనున్న బాలీవుడ్ స్టార్ హీరో.!

ప్రపంచ వ్యాప్తంగా చెస్‏లో ఎన్నో ఘనతల్ని సాధించి.. విశ్వవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు దిగ్గజ విశ్వనాథన్ ఆనంద్. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, పద్మ విభూషణ్

సెట్స్‌పైకి వెళ్లనున్న చెస్ దిగ్గజం బయోపిక్.. ప్రధాన పాత్ర పోషించనున్న బాలీవుడ్ స్టార్ హీరో.!
Rajitha Chanti

|

Feb 12, 2021 | 8:43 AM

ప్రపంచ వ్యాప్తంగా చెస్‏లో ఎన్నో ఘనతల్ని సాధించి.. విశ్వవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు దిగ్గజ విశ్వనాథన్ ఆనంద్. రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, పద్మ విభూషణ్ అవార్డులను దక్కించుకున్నారు ఆనంద్. అయితే ఆయన జీవితం ఆధారంగా ఓ సినిమా తీస్తున్నట్లుగా గతేడాది డిసెంబర్ నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ఎంతో మంది ప్రముఖుల జీవిత కథలు వెండితెరపైకి వచ్చాయి. స్పోర్ట్స్, సినిమాలు, శాస్త్రవేత్తలు, నాట్యకారులు ఇలా చాలా మంది జీవిత కథలను అటు బాలీవుడ్, కోలివుడ్, టాలీవుడ్ ఇండస్ట్రీలలో తెరకెక్కించారు. ఇక గతేడాది విశ్వనాథన్ ఆనంద్ జీవిత కథను తెరకెక్కిస్తున్నట్లుగా వార్తలు వచ్చినప్పటి నుంచి ఆ పాత్రలో ఎవరు నటించనున్నారనే విషయంపై అనేక కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలోనే నిర్మాత మహావీర్ జైన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నిర్మాత మహావీర్ జైన్ మాట్లాడుతూ.. “ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇందులో నటించే ప్రధాన నటీనటుల గురించి ఇప్పుడేం చెప్పలేం. అయితే ఆనంద్ జైన్ పాత్రలో అమిర్ ఖాన్ సరిగ్గా సరిపోతాడని నా అభిప్రాయం” అని అన్నారు. ప్రస్తుతం ఈ స్టోరీని డెవలప్ చేసే పనిలో ఉన్నామని.. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానున్నట్లుగా తెలిపారు. మహావీర్ జైన్‏తో కలిసి ఈ సినిమా నిర్మిస్తున్న బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ నిర్మాణంలో భాగమయ్యారు.

ఇప్పటికే నిజజీవిత కథతో తెరకెక్కిన ‘దంగల్’ సినిమాలోని మహావీర్ సింగ్ ఫొగాట్‏గా నటించి అమిర్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అమిర్ ‘లాల్ సింగ్ చద్ధా’ సినిమా షూటింగ్‏లో పాల్గోంటున్నాడు. ‘టామ్ హాంక్స్ ఫారెస్ట్ గంప్’ సినిమాకు రీమేక్‏గా దీనిని నిర్మిస్తున్నారు.

Also Read:

Sampoornesh Babu: ‘బజార్‌ రౌడీగా’ మారిన సంపూర్ణేష్‌ బాబు… వైరల్‌ అవుతోన్న బర్నింగ్‌ స్టార్‌ న్యూ లుక్‌..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu