Earthquake: తీవ్ర విషాదం మిగిల్చిన భూకంపం.. 200 మందికి పైగా మృతి.. శిథిలాల కింద పలువురు..

|

Feb 06, 2023 | 12:51 PM

తీవ్ర భూకంపం ధాటికి టర్కీ, సిరియా చిగురుటాకుల్లా వణికిపోయాయి. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 7.8గా నమోదైంది. భూకంపం ధాటికి దక్షిణ టర్కీలో చాలా భవనాలు నేలకూలాయి. వంద మందికి పైగా మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న..

Earthquake: తీవ్ర విషాదం మిగిల్చిన భూకంపం.. 200 మందికి పైగా మృతి.. శిథిలాల కింద పలువురు..
Earthquake In Turkey
Follow us on

తీవ్ర భూకంపం ధాటికి టర్కీ, సిరియా చిగురుటాకుల్లా వణికిపోయాయి. రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 7.8గా నమోదైంది. భూకంపం ధాటికి దక్షిణ టర్కీలో చాలా భవనాలు నేలకూలాయి. వంద మందికి పైగా మృతి చెందారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. దక్షిణ టర్కీ గాజియాంటెప్‌ సమీపంలో సోమవారం తెల్లవారుజామున 4.17 గంటలకు భూమి కంపించింది. ఆ తర్వాత వరుసగా పలుమార్లు ప్రకంపనలు సంభవించాయి. ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనతో ఇళ్ల నుంచి పరుగులు తీశారు. 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. సైప్రస్‌, గ్రీస్‌, జోర్డాన్‌, లెబనాన్‌లో కూడా ప్రకంపనలు చోటుచేసుకున్నాయని అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది.

సిరియా వాయువ్య ప్రాంతంలో పలు నివాస భవనాలు కూలిపోయాయి. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారని సిరియన్ సివిల్ డిఫెన్స్ తెలిపింది. అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయకచర్యలు చేపట్టారు. దక్షిణ టర్కీ ప్రావిన్స్‌లోని ఉస్మానియేలో 15మంది మృతి చెందినట్టు ప్రకటించారు అధికారులు. చాలా భవనాలు కుప్పకూలాయి. 7.8 తీవ్రతతో వచ్చిన భూప్రకంపనలతో ఆస్తి, ప్రాణ నష్టం భారీగా ఉండొచ్చని తెలుస్తోంది.

టర్కీ, సిరియా లో ప్రకృతి బీభత్సం సృష్టించింది. సోమవారం తెల్లవారుజామున భారీ భూకంపం సంభవించి పలు నగరాల్లో వందలాది భవనాలు కుప్పకూలాయి. టర్కీలో తరచూ భూకంపాలు సంభవిస్తుంటాయి. 2020 జనవరిలో ఇలాజిగ్‌ ప్రాంతంలో 6.8 తీవ్రతతో భూకంపం సంభవించింది. అప్పుడు 40 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అదే ఏడాది అక్టోబరులో 7.0 తీవ్రతతో సంభవించిన భూకంప విలయంలో 114 మంది మృత్యువాతపడ్డారు. సిరియా, టర్కీతో పాటు లెబనాన్, ఇరాక్, ఇజ్రాయిల్, పాలస్తీనా, సైప్రస్, గ్రీస్‌, జోర్డాన్‌ దేశాల్లోనూ భూకంపం ప్రభావం చూపించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..