Bird flu: మరోసారి బర్డ్‌ఫ్లూ కలకలం.. 10 వేలకు పైగా బాతులను చంపేసిన అధికారులు.. ఎక్కడంటే..

Bird flu: ప్రపంచంపై నిత్యం ఏదో ఒక వైరస్‌ దాడి చేస్తూనే ఉంది. కరోనా మహమ్మారి సృష్టించిన విలయం తాలూకు చేదు జ్ఞాపకాలు మర్చిపోకముందే రకరకాల కొత్త వ్యాధులు ముంచుకొస్తున్నాయి. మానవాళి మనుగడమే..

Bird flu: మరోసారి బర్డ్‌ఫ్లూ కలకలం.. 10 వేలకు పైగా బాతులను చంపేసిన అధికారులు.. ఎక్కడంటే..
Bird Flu In Ducks
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 29, 2022 | 1:56 PM

Bird flu: ప్రపంచంపై నిత్యం ఏదో ఒక వైరస్‌ దాడి చేస్తూనే ఉంది. కరోనా మహమ్మారి సృష్టించిన విలయం తాలూకు చేదు జ్ఞాపకాలు మర్చిపోకముందే రకరకాల కొత్త వ్యాధులు ముంచుకొస్తున్నాయి. మానవాళి మనుగడమే ప్రశ్నార్థకంగా మార్చేస్తూ ప్రపంచంపై దండెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఫ్రాన్స్‌లో బర్డ్‌ఫ్లూ కలకలం రేపింది. ఫ్రాన్స్‌లోని ఓ బాతుల ఫామ్‌లో ఏవియన్‌ ఇన్‌ప్లూఎంజా అనే అత్యంత వ్యాధికారక బర్డ్‌ ఫ్లూని గుర్తించారు. దీంతో ఫామ్‌లో ఉన్న ఏకంగా 10,600 బాతులను చంపేసినట్లు ఫ్రెండ్‌ మీడియా తెలిపింది. సెయింట్‌ నిజియర్‌ లే డెసర్ట్‌లోని బాతుల ఫామ్‌లో H5N1 వైరస్‌ కారణంగా ఏవియన్‌ ఇన్‌ఫ్లూఎంజా వ్యాప్తిచెందిందని అధికారులు తెలిపారు.

కొన్ని బాతులు అసాధారణ రీతిలో మరణించడంతో బర్డ్‌ ఫ్లూ ఇన్ఫెక్షన్‌ అయ్యుంటందన్న అనుమానం కారణంగా పరిశోధకులు నిర్వహించిన పరీక్షలో ఈ వైరస్‌ ఉన్న విషయం తెలిసిందని చెబుతున్నారు. దీంతో వెంటనే అలర్ట్‌ అయిన అధికారులు చర్యలు ప్రారంభించారు. వైరస్‌ను గుర్తించిన ఫామ్‌ను పూర్తిగా శానిటైజ్‌ చేసేశారు. మూడు కిలో మీటర్ల మేర రక్షణ జోన్‌గా, 10 కిలో మీటర్ల నియంత్రణ జోన్‌గా ప్రకటించారు. ప్రజలు ఎవరూ అటువైపు రాకుండా కఠిన ఆంక్షలు అమలు చేశారు.

ఇదిలా ఉంటే ఫ్రాన్స్‌లో గతంలోనూ బర్డ్‌ఫ్లూ విజృంభించింది. 2021 నవంబర్‌లో 1300 కంటే ఎక్కువ వైరస్‌ సమూహాలను గుర్తించారు. ఆ సమయంలో ఏకంగా 20 మిలియన్ల పక్షులను చంపాలని అప్పట్లో అధికారులు అదేశించారు. ఇక 2020-21 సమయంలోనూ 500 రకాల వ్యాధికారక బర్డ్‌ఫ్లూ సమూహాలను పరిశోధకులు కనుగొన్నారు. దీంతో దేశ వ్యాప్తంగా 3.5 మిలియన్‌ పక్షులను చంపేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..