AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Monkeypox : కాంగోకి బిగ్ రిలీఫ్.. స్థిరంగా Mpox కొత్త వేరియంట్.. బురుండి, ఉగాండాలో వేగంగా వ్యాప్తి..

ఆప్రికా లోని కాంగో లో మంకీఫాక్స్ కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. కాంగో ప్రాంతంలో Mpox కేసులు స్థిరంగా ఉన్నాయి. దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు బురుండి, ఉగాండాలో ఈ కొత్త వేరియంట్ సంక్రమణ నిరంతరం పెరుగుతోంది. అదే సమయంలో కాంగోలో ఈ వైరస్ వ్యాప్తి స్థిరంగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు.

Monkeypox : కాంగోకి బిగ్ రిలీఫ్.. స్థిరంగా Mpox కొత్త వేరియంట్.. బురుండి, ఉగాండాలో వేగంగా వ్యాప్తి..
Mpox CasesImage Credit source: AP Photo/Moses Sawasawa, file
Surya Kala
|

Updated on: Nov 11, 2024 | 7:03 PM

Share

మంకీఫాక్స్ (MPOX) కొత్త వేరియంట్ కాంగోలో వ్యాప్తి స్థిరంగా ఉంది. ఈ వార్తా ఆ ప్రాంతానికి కొంత రిలీఫ్ ఇచ్చినట్లు అయింది. ఈ కొత్త వేరియంట్ కనుగొనబడిన ప్రాంతంలో MPox కేసులు స్థిరంగా ఉన్నాయని WHO పేర్కొంది. అయినప్పటికీ దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు బురుండి, ఉగాండాలో ఈ కొత్త వేరియంట్ సంక్రమణ నిరంతరం పెరుగుతోంది. Mpox ఇన్ఫెక్షన్ల సంఖ్య రోజు రాజకీ పెరుగుతున్నాయని WHO తెలిపింది. అయితే దక్షిణ కివులో త్వరలో రాగ్గవచ్చు అని పేర్కొంది. ఇక్కడ ఈ సంవత్సరం ప్రారంభంలో కమిటుగాలోని సెక్స్ వర్కర్లు, మైనర్‌లలో Mpox కి సంబంధించిన రూపాంతరం చెందిన శక్తివంతమైన మంకీఫాక్స్ (MPOX) కొత్త వేరియంట్ గుర్తించబడింది.

ఇన్‌ఫెక్షన్‌కు సంబంధించిన పరీక్షలు ఇప్పుడు ఎక్కువగా జరగడం లేదని WHO చెబుతోంది. దీన్నిబట్టి వైరస్ వ్యాప్తి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవడం కష్టం తరంగా మారిందని పేర్కొంది. గత వారం డేటా ప్రకారం కాంగోలోని ఒక ప్రయోగశాల ద్వారా 100 కంటే తక్కువ కేసులు నిర్ధారించబడ్డాయి. జూలైలో ఈ సంఖ్య 400గా ఉంది.

స్థిరంగా ఉన్నట్లు కనిపిస్తున్న వ్యాప్తి

ఇవి కూడా చదవండి

ఇటీవలి వారాల్లో ఇన్ఫెక్షన్ స్థిరంగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇది వైరస్ వ్యాప్తిని అంతం చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. కాంగోలో ఇప్పటి వరకు దాదాపు 50 వేల మందికి వ్యాక్సిన్‌ వేశారు. ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ అంచనా ప్రకారం Mpox వ్యాప్తి నిరోధానికి 3 మిలియన్ వ్యాక్సిన్‌లు అవసరం.

సంక్రమణ వ్యాప్తికి ప్రధాన కారణం

బురుండిలో MPOX వ్యాప్తికి కూడా కొత్త వేరియంట్ కారణమవుతుందని WHO తెలిపింది. వ్యాధి సోకిన వారికి తమకు వైరస్ సోకిందని.. ఈ వైరస్ తమ ద్వారా ఇతరులకు వ్యాపిస్తోందన్న విషయం కూడా తెలియదని పేర్కొన్నది. గత రెండు వారాల్లో బురుండి నుంచి ప్రతి వారం 200 కంటే ఎక్కువ కొత్త కేసులు నమోదవుతున్నాయి. బాధితుల్లో ఎక్కువ మంది పిల్లలు, వయో వ్రుద్దులున్నారు. . శారీరక కలయిక వల్లనే ఈ కొత్త వేరియంట్ వైరస్‌ ఎక్కువగా వ్యాపిస్తోందని డబ్ల్యూహెచ్‌ఓ తెలిపింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..