జర్మనీలో News9 గ్లోబల్ సమ్మిట్.. భారత్-జర్మనీ సంబంధాల బలోపేతానికి దోహదం
న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ ఈసారి జర్మనీలో జరగబోతోంది. ఈ కార్యక్రమం నవంబరు 21 నుంచి 23 వరకు మూడు రోజుల పాటు కొనసాగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్‌తో పాటు పలువురు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సులో ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు.
న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ ఈసారి జర్మనీలో జరగబోతోంది. ఈ కార్యక్రమం నవంబరు 21 నుంచి 23 వరకు మూడు రోజుల పాటు కొనసాగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్‌తో పాటు పలువురు జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొంటారు. ఈ సదస్సులో ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు. భారత్ – జర్మనీ మధ్య మైత్రీ సంబంధాలు మరింత బలోపేతం అయ్యేందుకు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ దోహదపడనుంది. వాణిజ్య రంగంలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై ఈ సదస్సులో లోతైన చర్చ జరగనుంది. ఇరు దేశాలకు చెందిన రాజకీయ, వాణిజ్య, క్రీడా, సినీ ప్రముఖులు తమ అభిప్రాయాలను న్యూస్9 వేదికగా వెలిబుచ్చనున్నారు. మూడు రోజులు జరిగే సమ్మిట్‌లో పలు కీలక అంశాలపై లోతైన చర్చ జరగనుంది.
ప్రపంచంలో ఏయే ప్రాంతాలు అభివృద్ధి చెందాలని భావిస్తున్నాయనే దానిపై ప్రముఖులు తమ అభిప్రాయాలను తెలియజేస్తారు. TV9 నెట్‌వర్క్ MD బరున్ దాస్ ఈ శిఖరాగ్ర సమావేశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని పంచుకున్నారు. ఈ సమ్మిట్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వీడియోలో చూడండి